పూర్వార్ధము - అవరోహణ క్రమము
ఈ ప్రకారంగా ఆలోచిస్తూ పోతే మన ఆలోచనే కుంటు పడుతుది. పని చేయక నిలిచి పోతుంది. ఇలాంటి ఇంతటి విస్తారం గల జడ ప్రకృతిని అవలీలగా బయట పెడుతున్నదంటే ఆ శక్తి ఎంత ప్రభావం గలదో ఎంతటిదో వర్ణనాతీతం. వర్ణించటమనే మాట వస్తే మనం కాదు. దానినదే వర్ణించి చెప్పవలసి ఉంటుంది.
16. ఆకీట బ్రహ్మ జననీ
కేవలం ఇలాంటి జడ ప్రకృతినే కాదు. చేతన ప్రకృతికి కూడా ఆ మహా శక్తే జనని. పిపీలికాది బ్రహ్మ పర్యంతమని వర్ణిస్తారు పెద్దలు. పిపీలకలంటే చీమలు దోమలు మొదలైన కీటకాలు. ఈ కీటకాలు మొదలుకొని సత్యలోకాధిపతి అయిన బ్రహ్మదేవుడి వరకు ఎంత చేతన ప్రపంచముందో దానినంతటిని సృష్టించింది ఆ మహాతల్లే. చేతనాచేతనాలనే రెండు రూపాలలో ఆవిడే గదా పరిణమించిందని వర్ణించాము. అందులో అచేతన భాగమెంతటిదో నిరూపించాము. ఇప్పుడు రెండవదైన చేతన భాగాన్ని నిరూపిస్తున్నదీనామం. జడ పదార్థాలలో మాదిరి చేతనాలలో శక్తి మార్పు చెందదు. గుణంలో మార్పు లేకున్నా పరిమాణంలో ఉన్నట్టు కనిపిస్తుంది. కీటకం మొదలు హిరణ్యగర్భుడి వరకు విచారిస్తూ పోతే చైతన్యంలో తారతమ్యమెంతో గోచరిస్తుంది. అది ఇలాంటిదని గాని ఇంత అని గాని లెక్కించి చూపలేము. ఆలోచనకు మించిన వ్యవహారమది.
భూలోకం మొదలు సత్యలోకం వరకు ఊర్ధ్వ లోకాలేడు. అతలం మొదలు పాతాళం వరకు అధో లోకాలేడు. వెరసి పద్నాలుగు లోకాలు. ఈలోకాలలో నివసించే దేవమానవ దానవాది
Page 35