#


Index

సింహావలోకనము

సిద్ధి చతుష్టయాన్ని భుజించే వాడు. అంటే అనుభవించే వాడెవడో వాడే చతుర్భుజుడు. అలాగే ప్రసన్న వదనం. తనకే పరమాత్మతత్త్వం ప్రసన్నమైందో దానిని వదనం. సాధకులకు చెబుతూబోయేవాడని అర్థం. ఇలాంటి లక్షణాలు గలవాడే మహా గణేశుడు. ఆయనే మహా గురువు మనబోటి శిష్య కోటికంతటికీ. అలాంటి సద్గురువును ఆశ్రితుడైన శిష్యుడు సదా ధ్యాయేత్. ధ్యానించాలి. ఎందు కోసం. సర్వ విఘ్నోపశాంతయే. సర్వ విఘ్నాలూ ఏవో కావు. ఈ సంసారమే. దీనికి ఉపశాంతి బ్రహ్మజ్ఞానం వల్లనే. మరి దేనివల్లా కాదు. కనుక అలాంటి ప్రయోజనాన్ని అర్థించిన ప్రతి ముముక్షువైన సాధకుడూ అలాంటి ఆచార్య పురుషుణ్ణి శ్రద్ధతో సేనించాలని తాత్పర్యం.

  ఏతావతా తేలిన సారాంశ మేమిటీ. మహాగణేశ్వరుడనే గురువును సేవించి శివ సాయుజ్య మార్గాన్ని గుర్తించి విమర్శ రూపమైన బుద్ధితో ప్రకాశ రూపమైన సిద్ధిని పొందగలగాలి సాధకులమైన మనమంతా.

ప్రకాశామర్శ హస్తాభ్యం-అవలంబ్యోన్మనీ స్రువం ధర్మాధర్మ మల స్నేహం - పూర్ణ వహ్నౌ జుహోమ్యహం. అని లోకానికంతా చాటి చెప్పిన శివాద్వయ వాదుల సుభాషితం జీవితాంతమూ అనుసంధానం చేస్తూ పోవాలి. మానవ జీవితమే ఒక మహా యజ్ఞం. దానికి యజ్ఞ కుండం అను క్షణమూ ప్రజ్వలించే ఆత్మచైతన్యమే. దానిలో హోమం చేయవలసిన హవిస్సు ధర్మాధర్మ రూపమైన సంసారమే. వాటి మలం అనాది సిద్ధమైన

Page 131

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు