సింహావలోకనము
అవిద్య. దానిని ఉన్మనీ భావమనే స్రువంలో పోసి ప్రకాశమూ విమర్శా అనే రెండు హస్తాలతో పైకేత్తి జ్ఞాన వహ్ని కుండం లోనే నిత్యమూ హోమం చేస్తూ పోవాలని అర్థం. అలా చేస్తూ పోతే అనాత్మ భావమంతా భస్మీభూతమై శివాత్మభావమే మనకు దక్కుతుంది. సమస్తమైన నామ పారాయణ ఫలం కూడా అయత్నంగానే మనకు సిద్ధిస్తుంది.
శివ శ్శబ్దః శివోహ్యర్థః- శివస్సర్వమిదం జగత్ శివాదన్యత్ యదాభాతి- తదప్యాకలయే శివం.
Page 132