ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
పొంద లేకున్నారు. బహూనాం జన్మనామంతే అని వర్ణించినట్టు ఎన్నో జన్మలకు గాని అలాటి ప్రపత్తికి నోచుకోలేక పోతున్నారు.
45. దుఃఖ హంత్రీ
46. పురుషార్థప్రదా
అత్యుత్తమమైన ఆ భూమిక నందుకోవాలే గాని మరు క్షణమే మానవుడి హృదయ గ్రంధులన్నీ విశీర్ణమై పోగలవు. దుఃఖానుభవమే గ్రంధి. దఃఖాలయమని వర్ణించారీ సంసారాన్ని. శాస్త్రమే గాదు. లోకానుభవమే చెబుతున్నది మనకు. దుఃఖ భాజనుడు కాని వాడు లేడు. శ్రీ మంతుడైనా దరిద్రుడైనా తప్పించుకోలేడు.
ఇలాంటి సంసార దుఃఖాన్ని పోగొట్టుకోటానికే జీవితంలో మన ప్రయత్నాలన్నీ. అయినా సఫలత లేదు మనకు. ఒకటి పోతే మరొకటి కనిపెట్టుకొనే ఉంటుంది. సమూలంగా ఇది నశించాలంటే ఆత్మైక దర్శనమే దానికి దివ్యౌషధం. దాన్ని ప్రసాదించి సాధకుడికి ఏర్పడిన సకల దుఃఖాలూ హననం చేస్తుంది గనుక దుఃఖ హంత్రి అయిందా దేవి. స్వస్థ గనుకనే దుఃఖ హంత్రి కూడా. అస్వస్థత వల్లనే అన్ని దుఃఖాలు. స్వస్థా ఏకాకినీ అయిన దశలో ఏ దుఃఖమూ లేదు.
దుఃఖాలన్నీ నిర్మూలమైతే పురుషార్థాలన్నీ మన కప్రయత్నంగానే సిద్ధిస్తాయి. అర్థమూ అనర్థమని రెండే ఉన్నాయి మానవులకు. అర్ధించేదేదో అది అర్థం. అర్థించనిది అనర్థం. సుఖ దుఃఖాలే అర్థానర్థాలు. పురుషుడెప్పుడూ సుఖాన్నే కోరుతాడు గానీ దుఃఖాన్ని కోరడు. కనుక సుఖమే పురుషార్థం. అది నాలుగు విధాలు. ధర్మం- అర్థం-కామం-మోక్షం. అందులో మొదటి మూడూ అనాత్మ ప్రపంచ సంపర్కమున్నవి కనుక ఎప్పుడో కొంత సుఖ మిచ్చినా చివరకు దుఃఖదాయకమే.
Page 114