ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
అలా దుఃఖంతో ఎప్పుడూ మిశ్రితం కాని నిత్య సుఖాన్ని మనకందించేది మోక్షమనే నాలుగవ పురుషార్ధమొక్కటే. అందులో అనాత్మ ప్రపంచ గంధం కూడా కాన రాదు. కనుక నిజానికి పురుషార్ధమదే. అది ఒకటి లభిస్తే మిగతా మూడు పురుషార్థాలు కూడా అందులోనే మనకు కలసి వస్తాయి. వాటి కోసం వేరే ప్రయత్న మక్కర లేదు. అంచేత అమ్మవారు పురుషార్థ ప్రదా అంటే ఐహికాముష్మిక పురుషార్థాలు రెండూ మనకు ప్రసాదిస్తుందని తాత్పర్యం.
47. స్వర్గాప వర్గదా
48. నిర్వాణ సుఖ దాయినీ
కాని ఈ విషయంలో చాలా మంది శాస్త్రజ్ఞులే పేచీ పడుతున్నారు. వారు వాదించే దేమంటే అతీంద్రియమైన విషయంలో శాస్త్రమేగదా మనకు ప్రమాణం. అతీంద్రియమైన విషయాలు రెండే రెండు. ఒకటి స్వర్గం- మరొకటి అపవర్గం. వీటికి భిన్నంగా అర్థకామా అనేవి రెండూ కేవల మైహికం. ఇంద్రియ గోచరం. కనుక వాటిని ఉపేక్షించినా తప్పులేదు. ధర్మ బ్రహ్మములు మాత్ర మలా ఉపేక్షించరాదు. అని రెండూ శాస్త్ర చోదితం. అలాంటప్పుడు అందులో ధర్మాన్ని వదిలేసి మోక్షమొక్కటే పురుషార్థమనట మేమి సబబు.
ఇది సరి అయిన వాదం కాదు. ధర్మం శాస్త్ర ప్రమాణకమే కావచ్చు. ఐహికమైన అర్థకామాలకు విలక్షణమే కావచ్చు. కనుకనే మోక్షంలాగా దానికీ ఆముష్మికమనే పేరు వచ్చింది. వీటి రెండింటినీ ఆ దేవత మనకు ప్రసాదిస్తుంది కూడా. కానీ రెండింటికీ చాలా అంతర ముంది. ధర్మ మాముష్మిక మైనా- అర్థకామాలకన్నా
Page 115