ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము
తనకు భేదం లేదు కనుకనే- ఏ క్షణంలో ఆవిడ నలా వీక్షించ గలమో- ఆక్షణంలోనే అలా మనకు మరలా సాక్షాత్కరిస్తుంది. అలా కాకుంటే మనమెంత ప్రయత్నించినా భేద రహితంగా ఆవిడ నెప్పుడూ భావించలేము. అందుకోలేము. భేద మనేది ఆవిడ స్వరూపంలో లేదు గనుకనే అలా దర్శించ గోరే మన దృష్టినికూడా నిర్భేదం చేయగల దావిడ. భేద నాశినీ అనే మాటకిదే అర్థం. మనలో ఉండే భేదాన్ని కూడా నశింప జేయగలదు. భేదం లేనిదే భేదాన్ని నశింపజేస్తుంది. మనకు భేదం కాల్పనిక మైతే - ఆవిడ కభేదం స్వాభావికం. స్వాభావిక మైనదెపుడూ కాల్పనికాన్ని కొట్టివేయటానికి సమర్థమే. అయితే ఆ అభేదాన్ని మన దృష్టిలో నింపుకొని భేద ప్రపంచాన్ని చూడటం అలవరుచుకోవాలి. అప్పుడా అభేద దృష్టే భేత ప్రపంచాన్ని రజ్జ దృష్టి సర్పాదులను నిర్మూలించినట్టు నిర్మూలించగలదు.
30. నిర్మమా
31. నిరహంకారా
భేద ప్రపంచమంతా ఈ విధంగా నశించి పోతే మమకారమూ అహంకారమూ అనే రెండూ కూడా దానితోపాటు నశించక తప్పదు. ఎలాగంటే నామ రూపాత్మకమైన ఈ జగత్తంతా ఆత్మ రూపంగానే మారిపోయింది. కనుక మమకారానికి తావులేదు. అలాగే దాని నభిమానించే జీవుడుకూడా ఆత్మరూపుడే అయ్యాడు కనుక అహంకారానికి చోటు లేదు. అంతటా ఆత్మ భావమే రాజ్యం చేస్తున్నప్పుడు ఈ చోరులకు ప్రవేశమెక్కడిది.
అంతకు పూర్వం నేనీ దేహం మేరకే ఉండిపోయి దానినహమనీ- దనికి బాహ్యంగా కనిపించేదంతా మమ అనీ-చూస్తూ వచ్చాను. ఇప్పుడీ శరీరంతో సహా సకల జగత్తూ ఆత్మగానే
Page 101