#


Index

ఉత్తరార్ధము - ఆరోహణ క్రమము

మారిపోయింది. అహమని ఎక్కడ పెట్టుకోవాలి అభిమానం. మమ అనే భావ మెక్కడ చూపాలి. నిమిత్తముంటే గదా నైమిత్తికం. అది లేకుంటే ఇదీ లేదు. ఛత్రం లేకుంటే ఛాయ లేనట్టే శరీర జగత్తులు లేకుంటే అహంకార మమకారాలు కూడా లేనివే.

  అయితే ఒక సందేహం. అంతా ఆత్మగా మారిన దశలోకూడా దానిని అహమనే కదా గ్రహించవలసింది. అలాగే జగత్తు కూడా ఆ దశలో నా శక్తి అనే కదా దన్ని గ్రహించవలసింది. అలాంటప్పుడు అహం మమలు రెండూ పూర్తిగా కరిగి పోవట మెలా సంభవం. అది మాకా దశలో అంగీకార్యమనే చెబుతారు వేదాంతులు. పూర్ణానుభవంలో అహం మమలు ఉన్నా పొరబాటు లేదు. దోషం కాదది గుణమే. కారణమేమంటే అవి కూడా పూర్ణమైన ఆత్మ స్వరూపంగానే అనుభవానికి వస్తాయి. పూర్ణ చైతన్యాన్నే అప్పుడహమని భావిస్తాము గాని శరీరమాత్ర పరిమితమైన తత్త్వాన్ని కాదు. కనుకనే దాన్ని పూర్ణాహంకార మన్నారు. అహంకారమైనా అది అనహంకారమే. అలాగే ఈ ప్రపంచం కూడా చైతన్య శక్తి గానే అనుభవానికి వస్తుంది కాబట్టి మమ అయినా ఇది నిర్మమే. నాకంటే వ్యతిరిక్తంకాదు నా శక్తి అనే భావ ముంటుం దక్కడ. ఈ విధంగా శివ శక్తి రూపమైన అహంకార మమకారాలు పూర్ణాను భవ దశలో మన కామోద యోగ్యమే. ఈ భావానికి, సూచకమే ఈ రెండు నామాలు. నిర్ అనే మాటకు అసలే లేదని, పూర్తిగా ఉందనీ కూడా రెండు విధాలా అర్థం చెప్ప వచ్చునిక్కడ. అప్పుడు రెండు భావాలూ కలిసి రాగలవు.

Page 102

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు