అరసిచూస్తే ఇది కూడా అర్థంలేని ఆక్షేపణే. వర్ణాశ్రమ ధర్మాలనేవి ఇప్పుడేర్పడినవి కావు. మానవుడీ భూమి మీద అవతరించినప్పటినుంచీ అతణ్ణి అంటిపెట్టుకొని ఉన్నవే. మనమిప్పుడు చూచే రూపంలో కాక పోయినా ఏదో ఒకరూపంలో ఉండితీర వలసిందే. సమాజంలో మేధావులు కొందరుంటారు. పాలకులు కొందరుంటారు. వ్యాపారులు కొందరైతే శ్రామికులు మరి కొందరుంటారు. నాలుగు వర్ణాలని కాక పోయినా నాలుగు వర్గాలైనా ఉండక తప్పదు. ఇప్పుడూ ఉన్నాయి కదా ఇవి అన్నిదేశాల్లో అన్నిజాతుల్లో. ఉన్నాయంటే అవి ఎలా ఏర్పడ్డాయి. వారి వారి గుణాల వల్ల. గుణాలను బట్టే ఆయాకర్మలూ లేదా వృత్తులు. గుణమంటే మనమనుకునే మంచి చెడ్డకాదు. సత్త్వరజస్తమస్సులు. అందులో సత్త్వరజస్సుల హెచ్చుతగ్గుల వల్ల బ్రహ్మక్షత్రా లేర్పడితే - రజస్తమస్సుల హెచ్చుకుందుల వల్ల వైశ్య శూద్రులు. శూద్రుడు తమోగుణ ప్రధానుడు. లేదా తమో గుణప్రధానుడెవడో వాడు శూద్రుడు. తమస్సు మూఢత్వానికి మారు పేరు. చదువు సంధ్యలూ, సంస్కారమూ లేనివాడని అర్థం. అలాటివాడికి పరిచర్య తప్ప తపశ్చర్య పనికిరాదు. పెద్దలను పరిచరించి తద్ద్వారా శమదమాదులూ జ్ఞాన విజ్ఞానాలూ గడించి క్రమంగా శూద్రత్వం పోగొట్టుకొంటే సంస్కారవంతుడవుతాడు. తపశ్చర్యాదుల కప్పుడర్హుడవుతాడు. అంతవరకూ అర్హత లేదు. ఇప్పుడూ అంతేగదా. ఒక వర్గం వాడుచేసిన పని మరొకడికి లాయకు కాదు. ఒకడు వైద్యశాస్త్రం చదివి మరొకవైద్యుడి వద్దకొన్నేండ్లు శిక్షణ పొంది తరువాత గదా వైద్య వృత్తి కర్హుడవుతాడు. అవిఏవీ లేకుండానే ఒక బోర్డు తగిలించుకొని వైద్యం చేస్తే ఒప్పుకొంటుందా ప్రభుత్వం. తగిన శిక్ష విధిస్తుంది.
అలాగే శిక్షించాడు రాముడు కూడా శంబూకుణ్ణి. విప్రుడు అకాలంగా మరణించిన తన కుమారుణ్ణి రాజద్వారం దగ్గర పెట్టి ఇదంతా నీ పరిపాలనలో దోషమే.
Page 92