#


Index

లేకపోతే కేనాద్య దుష్కృతేనాయం బాల ఏవ మమాత్మజః - అకృత్వా పితృకార్యణి - గతోవైవస్వతక్షయమ్ - నాలోనూ నీలోనూ ఏ దోషమూ దొరలకుండానే నాకు పితృకార్యం చేయవలసిన నా పుత్రుడు అకాలంగా ఇంత చిన్న వయసులోనే కన్ను మూస్తాడా అనిమొర పెడుతాడు. అందుకు రాముడు మధన పడుతుంటే నారదుడు సలహా ఇస్తాడాయనకు. ఏమని. రామ! యుగధర్మమని ఒకటున్నది. తపశ్చర్య అనేది కృతంలో బ్రాహ్మణుడూ - త్రేతలో క్షత్రియుడూ - ద్వాపరంలో వైశ్యుడూ - కలిలో శూద్రుడూ చేయాలి. ప్రస్తుతం శూద్రుడెవడో తొందరపడి ఈ త్రేతాయుగంలోనే చేస్తున్నట్టున్నాడు. ఆ ధర్మ వ్యతిక్రమం వల్లనే ఈ బ్రాహ్మణ బాలుడు మరణించి ఉంటాడు. కనిపెట్టమని చెబుతాడు. వెంటనే రాముడు పుష్పకాన్ని స్మరించి తదారూఢుడై నగరం నలుమూలలా వెదికితే దక్షిణ దిశగా ఒక సరస్సులో తల్లకిందులుగా వ్రేలుతూ తపస్సు చేసే శంబూకడనే శూధ్ర తాపసి ఒకడు కనిపిస్తాడు. దగ్గరికి వెళ్ళి నీవే వర్ణం వాడివని ప్రశ్నిస్తాడు రాముడు. శూద్రయోన్యామ్ ప్రసూతోస్మి - అని నిజమే చెబుతాడు. వాడు. అంతే కాక సశరీరంగా స్వర్గానికి వెళ్లాలని ఈ దారుణమైన తపస్సు చేస్తున్నానంటాడు. అసలు శూద్రుడు తపస్సు చేయటమే తప్పు. దానికి తోడు తలకుమించిన ఫలితాన్ని ఆశించట మంతకాన్నా అపచారం. వెంటనే ఖడ్గమ్ సురుచిరప్రభమ్- నిష్కృష్యకోశా ద్విమలం శిరశ్చిచ్చేద రాఘవః ఖడ్గం ఒరనుంచి పెరికి వాడి శిరస్సు నరికివేశాడట. ఏమిటీ ఘోరమని నీకూ నీకూ అనిపించవచ్చు ధర్మసూక్ష్మమనేది అలాగే ఉంటుంది. మనం ధర్మమని భావించింది ధర్మం కాకాపోవచ్చు. మన మ ధర్మమని చూచేది గొప్ప ధర్మమే కావచ్చు. మన మల్పజ్ఞులం. మన బుద్ధులూ و బుద్దులతో చేసే నిర్ణయాలు రెంటికీ హద్దులున్నాయి. గుణదోషాలు నిర్ణయించటానికే పరికరాలూ పనికిరావు. త్రికాలజ్ఞులైన మహర్షులు వారు సృష్టించిన వాఙ్మయం మనకు ప్రమాణం. అది ఎంత కఠినంగా శాసించినా మనకు శిరోధార్యమే.

Page 93