ఆ సీత తన కంటికి విరూపగా కనపడు తున్నదా. నిజానికి విరూప తాను. ఆవిడకాదు. ఆవిడ సురూపే. సురూపను విరూప' అని వర్ణించట మేమిటి. ఇదొక అబద్ధం. పైగా ఆవిడను మింగుతాను చేస్తానని బెదిరించటమేమిటి. ఇదొక అహంకారం, దీనికి కారణం దాని కామ మోహితత్వమేనని తెలుసు రాముడికి. అది ఇన్నిఅవతవక ప్రేలాపనలకు దారి తీసిందని గ్రహించాడు. నవ్వు వచ్చింది రాముడికి. ప్రహస్య- అంటాడు. వాల్మీకి. మందహాసం చేశాడట. ఇదిగో ఈ మందహాసమే మహామోసమని చెప్పాను. కృష్ణుడి విషయంలో. అది ఇప్పుడు రాముడి విషయంలో కూడా. ఏమిటీ మందహాసాని కర్థం. ఓసి పిచ్చిదానా! నీవే నిజాన్ని కప్పిపుచ్చి నన్ను బేలు పుచ్చటాని కబద్దమాడితే-నేను మాత్రమేమి తక్కువ చదివానా. ఆమాటకువస్తే నేనూ ఆడగలను అబద్ధం. కాని దానివల్ల సుఖం లేకపోగా లేనిముప్పు నెత్తికి తెచ్చుకోటమే అది. అంచేత అనవసరం. ఎవరిని మోసపుస్తున్నానని. అబద్దాలాడి పాడయిపోరాదని హెచ్చరించటానికే ఇది. జీవుల అబద్ధాన్ని అనుకరిస్తూ చేసిన దీ మందహాసం. మోసానికి మోసమే సమాధానం. అంతవరకూ బుజుబుద్ధితో మాట్లాడిన రాముడిక బుజుబుద్ధి దీనిపట్ల పనికిరాదని భావించాడు. అది తాను సురూపయిన సీతను కురూప అంటున్నది. ఎంత అబద్ధం. పైగా ఆవిడను మింగుతా నంటున్నది. నిజంగా అంతపని చేసినా చేయవచ్చు. మీదుమిక్కిలి ఎక్కడో దూరంగా నిలుచొని అమాయికంగా చూస్తున్న లక్ష్మణుణ్ణికూడా మింగుతానని బెదిరిస్తున్నది.
దీనికంతా మూలం దాని కామోద్రేకమే గదా అని గ్రహించాడు స్వామి. కామ మెక్కడ ఉన్నా సహించడాయన. తన తండ్రి దశరథుణ్ణి క్షమించలేదా విషయంలో, ఇక ఈ రాక్షసి దేమిటి. పైగా స్త్రీకి సహజంగా ఉండవలసిన లజ్జకూడా చూపటం లేదిది. అసహ్యంగా ప్రవర్తిస్తున్నది. అబద్ధాలాడు తున్నది. దానితో అలాగే వ్యవహరించి తన్మూలంగా దాని కామానికి తగిన శిక్ష విధించదలచాడు పరమాత్మ. అందుకే దానితో పరిహాస మాడటం.
Page 73