#


Index

  అటూ ఇటూ త్రిప్పి దాన్ని ఏడిపించటం. పాపం నీవెంత ముసలిదంటున్నా దీన్ని నేను వదలుకోను. నన్ను చేసుకొన్నా ఈ సవతిపోరు నీవు భరించలేవు. అదుగో వాడికే తగులమూ లేదు. వాణ్ణి చేసుకోమని లక్ష్మణుడి దగ్గరికి పంపుతాడు. ఎలాగూ వాడు పలకరించడని తెలుసు. అంతేగాక వాడొక ఆడదానితో ఎలా మాట్లాడుతాడో చూతామని వాడి మనసు తెలుసు కొందామనే పరీక్ష అయినా కావచ్చు ఆయన ఉద్దేశం. భగవానుడి సంకల్పం జీవులకంతు పట్టేదికాదు గదా. అన్నగారి మాటల్లో అంతరార్థమా తమ్ముడూ చక్కగా గ్రహించినట్టుంది. కనుకనే ఆయన సీతను ముసలిదంటే తానూ దానితో మావదినె నిజంగా ముసలిదే వెళ్లి మళ్లీ ప్రయత్నించిచూడు. తప్పకుండా వదిలేసి నిన్ను చేసుకొంటాడని పంపుతాడు. అది తిరిగివచ్చి దీన్ని మింగుతానని ఇక పట్టలేక సీతమీదికి దూకబోతుంది. అక్కడికి వదిలేశాడు రాముడు హాస్యం. ఎందుకంటే అది అబద్దా లాడినందుకు తాను అలాగే దానికి జవాబిచ్చి ఏడిపించవలసినంత ఏడిపించాడు. ఇప్పుడది శ్రుతిమించి రాగాన పడింది. ఇక ఉపేక్షించరాదు. తగిన శిక్ష విధించాలి. అందుకే దానితో ఏమిటి పరిహాసం-శిక్షించిపంపమని లక్ష్మణుణ్ణి హెచ్చరిస్తాడు.

  ముసలిదికాని దాన్ని ముసలిదని విరూపకాని దాన్ని విరూప అంటావా విరూపవే అయిపొమ్మని చెప్పినట్టయిందిప్పుడు. బుజుబుద్ధుల దగ్గర వక్రబుద్ధితో ప్రవర్తిస్తే ఇదే శిక్షఅని చెప్పినట్టయింది. దీని ద్వారా స్త్రీగాని పురుషుడుగాని కామానికి దాసులై ప్రవర్తించరాదని అలా కన్నుమిన్ను గానక ప్రవర్తిస్తే కీడు మూడటం ఖాయమనీ ఎవరి మాటలూ చేష్టలూ వారికే బెడిసికొడతాయని ఒక గొప్ప సందేశ మందిస్తున్నది రాముని ఈ చర్య. దానికొక అపదేశ మీ పరిహాసాలూ అనృతంగా భాసించే ఆయన భాషణలూ. ఇంకా ఒక లోతైన భావమున్నా ఉండవచ్చు రాముడి ఈ వ్యవహారంలో. తానవతరించింది రావణసంహారానికి గదా శూర్పణఖ ఆ రావణుడి చెల్లెలు.

Page 74