#


Index

  అహంవేద్మి మహాత్మానమ్ నాకు తెలుసు రాముడంటే ఎవరో. నీకేమి తెలుసు. ఇంకా వసిష్ఠాదులకూ- తెలుసు. నీకు యశోధర్మలాభం మీద లోభముంటే నాతో పంపమని ఒప్పించి తీసుకుపోతాడు. ఆయన అలా తీసుకెళ్లుతుంటే ఎందుకు - ఎక్కడికనే ప్రశ్నేలేదు. ఆయన ఎన్నాళ్లనుంచో తనకు పరిచయ మున్నట్టూ - ఆయన వెంట వెళ్లటమే తన కర్తవ్య మయినట్టూ సంతోషంగా వెళ్లుతాడు రాముడు. గుర్వనువర్తన మంటే ఇది. ఆ గురువుగారి మీద అంత నమ్మకం శిష్యుడికి. వసిష్ఠుడందరిలో చెప్పనే చెప్పాడు కృతాస్త్ర మకృతాస్త్రంవా - నైనం ద్రక్ష్యంతి రాక్షసాః గుప్తమ్ కుశిక పుత్రేణ జ్వలనేనామృతం యధా తన కులగురువు వసిష్ఠుడంత వాడంత ప్రశంసాపత్ర మిచ్చిన విశ్వామిత్రుడెంత గొప్పవాడో ఇక ఎవరూ చెప్పనక్కరలేదు. రాముడికి. అందుకే మౌనంగా ఆయన ననుసరించాడు. అంతే గాదు ఏషోస్త్రాన్ వివిధాన్ వేత్తి - సర్వాస్త్రాణి భృశాశ్వస్యపుత్రాః పరమ ధార్మికాః కౌశికాయ పురాదత్తా ః సమస్త శస్త్రాస్త్ర విద్యలూ కరతలామలక మీయనకు-భృశాశ్వపుత్రులైన దివ్యాస్త్రాలన్నీ ఆయనకు పిలిస్తే పలుకుతాయని వసిష్ఠుడు చెప్పటం విన్నాడు. తన భవిష్యత్ప్రణాళిక కది చక్కగా సరిపోయిందను కొన్నాడు వినయంతో గురువు ననుసరించాడు.

  గురు జనం పట్ల మొట్టమొదట ఉండవలసింది వినయం. అది సంపూర్ణంగా ఉంది రాముడికి విశ్వామిత్రోయయా వగ్రే- తతోరామో మహాయశాః ముందు గురువుగారు నడుస్తుంటే వెనుక తాను నడుస్తున్నాడు. కాక పక్షధరుడయి కమనీయ రూపుడైన ఆ శిష్యుణ్ణి చూస్తే ఆ గురువు కూడా వాత్సల్యంతో కరిగిపోయేవాడు. రామా అని మధురంగా పిలిచేవాడు. నాయనా జలం చేతికి తీసుకో. చాల దూరం నడిచావు. శ్రమ అనిపించవచ్చు. క్షుత్పిపాస లేర్పడవచ్చు. రెండింటికి నివారణగా బలాతిబలలనే విద్యలు మీకుపదేశిస్తా నంటాడు. చూడండి. నాకే విద్యలూ చెప్పమని అడగడు రాముడు. వినయంగా అనుసరిస్తూ పోయా డంతవరకే.

Page 40