#


Index

ఇంత గాలి దుమారం దీనిమీద లేచినట్టు మరి దేని మీదా లేవలేదు. సకల కల్యాణ గుణ సంపన్నుడూ సర్వలోకాదర్శ భూతుడూ అయిన భగవంతు డేమిటి-పర స్త్రీ లోలుడయి అహోరాత్రాలూ వారితో యధేచ్ఛగా క్రీడించటమేమిటి. అది మనమెంతో పవిత్రమైన కథా వస్తువుగా కనుల కద్దుకోవట మేమిటని వీరి ఆక్షేపణ. ఆ మాటకు వస్తే ఈ ఆక్షేపణ ఇప్పుడీ రోజుల్లో మనబోటి పాఠకులంగాదు. భాగవత కథాశ్రవణం చేస్తున్న పరమభాగవతుడు పరీక్షిత్తే లేవనెత్తాడు. దానికి సమాధానమిస్తూ శుకమహర్షి

"నృణాంనిశ్రేయసార్ధాయ-వ్యక్తిర్భగవతో భువి అవ్యయస్యా ప్రమేయస్య-నిర్గుణస్య గుణాత్మనః నచైవమ్ విస్మయః కార్యో భవతా భగవత్యజే-

  నీ విందులో అశ్చర్యపడ నక్కరలేదు. అగణుడయి కూడా భగవాసుడు సగుణుడుగా భావిస్తున్నాడంటే అది మన బోటి జీవులనను గ్రహింటానికే. యోగేశ్వరేశ్వరుడాయన. ఏదిచేసినా అయనకు దాని గుణదోషాలేవీ అంటవు.

  అసలిది నీవుగాదు. కృష్ణుడే వేశాడీ ప్రశ్న గోపికలను. "ప్రతియాత వ్రజమ్ నేహ స్థేయం స్త్రీ భిస్సు మధ్యమాః” మీరిక్కడ ఉండరాదు. వెళ్లిపొండి. మాతరః పితరః పుత్రాభాతరః పతయశ్చవః మీకు తల్లీ దండ్రీ భర్తా బిడ్డలూ-ఉన్నారు గదా. “భర్తృ శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా-” భర్త పరిచర్యే కుల స్త్రీలకు సనాతనమైన ధర్మం. “దుశ్శీలో దుర్భ గోవృద్ధి-” ఏలాటి వాడైనా సరే. కట్టుకొన్న నాధుణ్ణి కాదనరాదు. "జుగుప్సితం చ సర్వత్రహ్యౌప పత్యం కులస్త్రీయః” కులస్త్రీ అయిన దానికి మిండఱిక మనేది మహాపాతకం. అని మందలిస్తే కర్ణ కఠోరమైన ఆ మాటలు విని గోపికలు

"మైవం విభోర్హతి భవాన్ గదితుమ్ నృ శంసం సంత్యజ్య సర్వ విషయాం స్తవ పాద మూలం భక్తా - భజస్వ దురవ గ్రహ - మా త్యజాస్మాన్-దేవో యధాది పురుషో భజతో ముముక్షూన్-

Page 119