వత్స్యామి మానుషేలోకే - పాలయన్ పృథివీమిమామ్ - క్రూరుడైన ఆ రావణుణ్ణి రూపుమాపి ఆ తరువాత కూడా పదకొండువేల సంవత్సరాలదాకా ఈ భూమండలాన్ని పాలిస్తూ అక్కడే ఉండిపోతానని భవిష్య ద్వృత్తాంతాన్ని కూడా ముందుగానే సూచిస్తాడు. తదనుగుణంగానే కృత్వాత్మానమ్ చతుర్విధమ్ - పితరం రోచ యామాస తదా దశరథమ్ నృపమ్ – తన ఒకే ఒక రూపాన్ని నాలుగు రూపాలుగా మలుచుకొని రామలక్ష్మణ భరత శత్రఘ్నులనే నలుగురు సోదరులుగా అవతరించాడని ఉంది.
అంతేకాదు. పరమాత్మ మీ కోసం మానవ లోకంలో అవతరిస్తున్నాడు కాబట్టి మీరుకూడా ఆయనకు తోడ్పడడానికి ఆయా బుషులకూ అప్సరసలకూ వానరాది రూపాలతో జన్మించండి పొండని చతుర్ముఖుడు దేవతల నాజ్ఞాపిస్తాడు కూడా. పూర్వమేవమయా సృష్టో జాంబవా నృక్షపుంగవః - ఆవులిస్తూంటే అకస్మాత్తుగా నా వక్త్రబిలం నుంచి జాంబవంతుడనే భల్లూక వల్లభుడు ముందుగానే ఆవిర్భవించాడు. పోతే మిగతా వాళ్ళనంతా మీ మీ అంశలలో సృష్టించమంటాడు. వారు సరేనని అలాగే సృష్టిస్తారు. అలా సృష్టి అయిన మహావీరులే వాలిసుగ్రీవ హనుమన్నల కుముదపనస గజగవయ గంధమాదనాదులంతా. వారంతా రెండు పాయలుగా చీలిపోయి కొందరు వాలిని కొందరు సుగ్రీవుణ్ణి సేవిస్తూ కూచుంటారు. బభూవ భూర్భీమ శరీర రూపైః సమావృతా రామసహాయ హేతోః రామ సహాయార్థం జన్మించిన ఆ యోధవీరు * లందరిచేతా ఈ వసుంధర క్రిక్కిరిసి పోయిందట.
కాబట్టి గ్రంథారంభమే మనకు సాక్ష్య మిస్తున్నది రాముడు విష్ణ్వంశ సంభూతుడేనని. ఆరంభమే గాదు. అంతంలో కూడా మరలా మనకిలాగే తార్కణ మవుతున్నది. అదేమిటంటే రాముడింకా రాజ్యపాలన సాగిస్తుంటే బ్రహ్మాదు లాయనకు స్వవిషయం జ్ఞాపకముందో లేదో తెలిపిరమ్మని యమధర్మరాజు నాయన దగ్గరకు పంపుతారు. అతడు సన్యాసి వేషంలో
Page 11