#


Index

  ఇది ఒకటి రహస్యం. ఇది అయిన తరువాత మరొక రహస్య మేమంటే కాళి- భద్ర-కామేశ్వరి-దుర్గ-అంబిక అని యోగ మాయ కెప్పుడు పేర్లు పెట్టారో అప్పుడా విడ విష్ణు మాయే గాక శివ మాయ కూడా అనుకో. వలసి వస్తుంది. దుర్గ-అంబిక-కాళి అన్నప్పుడు అవి పార్వతీ పర్యాయాలే గదా. పార్వతి శివ శక్తి. అవిడ విష్ణు శక్తి ఎలా అయింది. దీనిని బట్టే చెప్పవచ్చు మనం శివ కేశవులకు భేదం లేదని.

శివాయ విష్ణు రూపాయ - శివ రూపాయ విష్ణవే యథా శివ మయో విష్ణు - రేవం విష్ణు మయ శ్శివః

  అంతేకాదు. "యథాంతరం నపశ్యామి - తథామే స్వస్తి రాయుషి” వారిరువురికీ అంతరం చూడరా దంటున్నది వేద వాక్యం. ఇలా శివ కేశవు లిరువురూ ఒక్కటే తత్త్వం గనుకనే వారి శక్తులు కూడా భిన్నం కావు. అవీ ఒక్కటే. అందుకే యోగ మాయకు వైష్ణవ నామాలు శైవ నామాలూ రెండూ చెల్లుబడి అయినాయి. దుర్గ కాళి అంబిక ఇత్యాదులు శైవ నామాలైతే-వైష్ణవి- నారాయణి-కృష్ణా-మాధవి-ఇలాంటి వన్నీ వైష్ణవ సంజ్ఞలు. ఒకే శక్తి కలిగిన ఒకే ఒక తత్త్వం గనుకనే బాలకృష్ణుని లోనే శివమూర్తి దర్శించ గలిగాడు మహకవి పోతన. ఆ మాయా శక్తే ప్రస్తుతం కృష్ణ సహోదరిగా జన్మించటం మూలాన్నే పరమ భాగవతు లావిడను “సరసి జనాభ సోదరీ” అని కూడా సంబోధించి గానం చేశారు. తుదకు శివ పార్వతుల నామం కలలో కూడా స్మరించటాని కిష్ట పడని వైష్ణవోత్తములు కూడా వైష్ణవ దుర్గ అని ఒక కొత్త పేరు పెట్టి ఆ పరాశక్తిని తమ వైష్ణవాలయాల్లో ప్రతిష్ఠించి ఆరాధిస్తూ వచ్చారంటే ఇంత కన్నా ఉభయ మత సామరస్యానికి నిదర్శన మేముంది.

  అసలా మాటకు వస్తే ఈ శక్తి ఎవరో గాదు. సాక్షాత్తూ గాయత్రీ మంత్రాధి దేవత. మంత్రార్ధ మంతా ఆవిడ వ్యవహరం లోనే మనకు స్పష్టంగా బోధ పడుతుంది. సవిత యొక్క వరేణ్య మైన తేజస్సది. సవిత అంటే ప్రపంచ సృష్టికీ తన అవతార సృష్టికీ కర్త అయిన పరమేశ్వరుడే. జ్ఞానాత్మిక

Page 105