స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఆయన అయ్యాడో లేదో గాని కాళిదాసు అయి ఉంటాడటు వయో వృద్దుడు కాకున్నా విద్యా వృద్దుడు. అలాగే ప్రియ శిష్యా లలితే కళా విధా. అజుడు ప్రియా వియుక్తుడై వలవిస్తూ లలిత కళలలో నాకెంత ప్రియమైన శిష్యురాలవని వాపోతాడు. లలిత కళలని ఈనాడు మనమనే మాట ఏనాటిమాటో చూడండి. సంగీత నాట్య చిత్రలేఖనాదు లయిన కళ లన్నింటిలో ఎంత ప్రవేశమో లేనివా డయితే పని గట్టుకొని ఆ విలాప సన్నివేశంలో ఈ మాట స్మరించ లేడు మహా కవి. ఈ చెప్పిన అన్ని విద్యలలో కళలలో ఆయన కభిరుచి అభినివేశమూ ఉన్నదనేది కేవలం మన ఊహాగానం కాదు. లేదా ఆయన ఆ మాట లుదాహరించాడు కాబట్టి అలాటి ప్రజ్ఞ ఆయన కుండ వచ్చునని భావించటం కాదు. మొగమున్నది అర్ధమున్న దన్నట్టు ఆయన మన కందించి పోయిన నిక్షేపాలలాంటి కావ్యాలున్నాయి. సహృదయులం మనమున్నాము. చుడవచ్చు గ్రహించవచ్చు.
కావ్యాలలో నాటకాలలో లలిత కళలను గూర్చి ఎంతగా పరామర్శిస్తాడో చెప్పనలవి గాదు. ఇంతెందుకు. మొట్టమొదటి రచన అని మనం భావించే మాళవికాగ్నిమిత్ర నాటకంలోనే కళలలో ఆయనకెంత పరిణతి ఉందో గమనించ వచ్చు. నాయిక మాళవిక ఒక గొప్ప నాట్య కత్తె. ఆవిడను ఆ కళలో తీర్చి దిద్దిన వాడు గణదాసనే ఆచార్యుడు. అతడొక పాత్ర నాటకంలో. మరి ఆ నట్టువరాలి నాట్య భంగిమలు వర్ణించా డవి అతిలోకం. నాట్య కళా మర్మజ్ఞుడైతే గాని అలా వర్ణించ లేడు. మరి సంగీతంలో కూడా ఆరితేరినదే మాళవిక . సంగీత శాలలు నాట్య శాలలు ఎక్కడ బడితే అక్కడ సాక్షాత్కరిస్తాయి ఆయన నాటకాలలో. ఆనాటి రాజు లలాటి రమ్యమైన మందిరాలు నిర్మించి అందులో చక్కని సంగీత నాట్య ప్రదర్శనలు చూచే వారు కాబోలు. అగ్ని మిత్రుడి కదే పిచ్చి. భూలోకం నుంచి దేవలోకానికి కూడా రవాణా చేశాడీ నాటక రంగాన్ని కాళిదాసు. విక్రమోర్వశీయంలో సాక్షాత్తూ
Page 9