రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మరొక విశేష మేమంటే నాటక కర్త ఎంత పెద్ద కథ తీసుకొన్నా అందులో ఎంత వైవిధ్య మున్నా దాన్ని యథా సంభవంగా కుదించి ఫ్రాయగలడు. అందులో చెప్పవలసిన అంశాలు మాత్రమే చెబుతాడు. మిగతా ముప్పాతిక భాగం లుప్తం చేస్తాడు. లుప్తమైతే పూర్వాపర కథా సందర్భానికి భంగం వాటిల్లదా అని ప్రశ్న. అలాటి లోపం మరలా ప్రవేశక విష్కంభాదుల సాధనాలతో పూడ్చు కొంటాడు. పాత్రలు తమలో తాము చెప్పుకొనే మాటల ద్వారా జరిగిన అంశాలనూ జరగబోయే అంశాలనూ చూపకుండానే మనకు చూపినంతగా ఆవిష్కరిస్తాడు. ఈ సూచనలతో అంతా మనం చూచామనే అనుభూతి కలిగి తీరుతుంది. కధా వస్తువునిలా సంక్షిప్తం చేయటం వల్ల సహృదయుడికి విసుగు జనించదు సరిగదా ప్రదర్శిత మైన విషయం మనసులో బాగా హత్తుకొనే అవకాశముంది.
నాటకంలో ఇంకొక గుణం సమస్యలూ- వాటిని పరిష్కరించే విధానం. మామూలుగా కావ్యాలన్నిటిలో- అనగా అనగా ఒక రాజు- అని ఆరంభించి క్రమంగా సాగుతూ పోయి చివర కనుకొన్న చోట ఎక్కడో అంత మవుతుంది. ఇక్కడ నాటకంలో అలా కాదు. మధ్యలో ఎక్కడో మొదలవుతుంది ఇతివృత్తం. కొంచెం సాగీ సాగక ముందే ఒక సమస్య అంకురిస్తుంది. అది పరిష్కార మయ్యేలోపల మరొకటి ఉదయిస్తుంది. అదీ తీరితే ఇంకొకటి. ఇలా ఎక్కడి కక్కడ సమస్య లుత్పన్న మవుతూ- పరిష్కృత మవుతూ- చివర నిర్వహణ సంధిలోగాని అన్నిటికీ పరిష్కార మేర్పడదు. అంత వరకూ తరువాత ఏమిటి - తరువాత ఏమిటి- ఇది ఎలా పరిష్కార మవుతుందనే ఉత్కంఠ రసజ్ఞుల హృదయాల నుఱ్ఱూత లూగిస్తుంది. ఇలాటి సస్పెన్స్ లేదా గోపన మనేది మరి ఏ సాహితీ ప్రక్రియ లోనూ ఇంతగా కాన రాదు.
పోతే ఈ లక్షణాలన్నీ ఒక ఎత్తు. నాటకంలో కధా గమనంలోని బిగువు ఒక ఎత్తు. ప్రదర్శనీయం గదా నాటకమని పేర్కొన్నాము. ప్రదర్శన మన్నప్పు డది మందకొడిగా సాగరాదు. ఎప్పటికప్పుడు రంగమూ దృశ్యమూ మారుతూ
Page 82