#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

కాళిదాస ప్రత్యభిజ్ఞ పోవాలి. కదలి ముందుకు సాగాలి. ఒక జీవనది లాగా మధ్యలో ఎన్ని మలుపులు తిరిగినా తన గమ్యం చేరేదాకా ఎక్కడా నిలవకుండా సాగి పోవలసిందే. దీని మూలంగా నాటక రచనలో ఒక వేగమూ స్పందనా అనివార్యంగా చోటు చేసుకొన్నాయి. దానితో అది చాలా సజీవంగా సంరబ్దంగా నడుస్తున్న అనుభూతి నిస్తుంది భావుకుడికి.

  ఇలాటి విశిష్ట గుణా లెన్నో పొందుపడి ఉన్నాయి నాటక రచనలో. ఇలాటివే మన జీవిత నాటకం లోనూ కనిపిస్తున్నాయి. జగన్నాటక మనే గదా దీనికీ పేరు. ఈ నాటక మెలాటిదో సరిగా ఆ నాటకమూ ఇలాటిదే. ఇది భౌతికమైతే అది వైజ్ఞానికం. ఇంతే తేడా. నటన ప్రధాన మైనదే నాటకం. నటన మంటే అనుకరణం. అనుకరణం దేనికి. మానవ జీవితానికే. కనుకనే జీవిత మెంత సహజమో ఎంత సచేతనమో ఎంత విచిత్రమో- ఎంత సమస్యా బహుళమో ఎంత సత్యమో ఎంత అపరిహార్యమో ఎంత సర్వాంగ సుందరమో- అంత సర్వతోముఖమీ జీవిత సబ్రహ్మచారి నాటకం కూడా. అంచేత నాటకాంతం హి సాహిత్య మన్నారంటే అది అక్షరాలా సత్యం.

  ఇంత అనర్హమైన ప్రక్రియ గనుకనే ప్రతిభాశాలి అయిన ప్రతి ఒక్క రచయితా తమ తమ భాషలలో చక్కని నాటక మొకటి వ్రాసి తన రచనా కౌశలాన్ని రసజ్ఞ లోకానికి చాటుతూ వచ్చాడు. గ్రీకులూ రోమనులూ ఫ్రెంచ్ వారూ ఆంగ్లేయులూ- ఒకరేమిటి. అన్ని జాతులవారూ నాటక రచనకు శ్రీకారం చుట్టినవారే. షేక్స్పియరు కావ్యాల కంటే నాటకాలకే ఎంతో పేరు వచ్చింది. పోతే మన భారతీయుల దృష్టి కూడా మొదటినుంచీ నాటక రంగం మీదనే మొగ్గు చూపుతూ వచ్చింది. రామాయణ కాలం నుంచే నాటకాలు ప్రచారంలో ఉన్నాయంటే ఇక చెప్పేదేముంది. వధూ నాటక సంఘైశ్చ- సంయుక్తాం సర్వతః పురీం. అయోధ్యలో ఎక్కడ బడితే అక్కడ నాటక సమాజా లుండే వంటాడు వాల్మీకి. అవీ వధూ నాటకాలట. స్త్రీ పాత్రలు ధరించటానికి పురుషు లక్కరలేదు. స్త్రీలే ఉన్నా రంటాడు. దీనిని బట్టి

Page 83

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు