#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

పోయాడు. ఖడ్గ నిషక్త ప్రతిమం దదర్శ. ఆఖరుకు పెండ్లి ముస్తాబంతా చేసుకొని పరమ శివుడు తన ముఖ మెలా ఉందో అద్దంలో కాక ఖడ్గంలో చూచుకొన్నాడట. ఉత్తమ క్షత్త్రియ పుత్రుడే అలా చూచుకొనేది లోకంలో. బహుశా గుప్త రాజుల వ్యవహారం జ్ఞప్తికి వచ్చి ఉంటుంది మహా కవికి. తరువాత నంది భుజావలంబనతో వృషభాన్ని అధిరోహించి అకాశ మార్గంలో తరలి వచ్చి బ్రహ్మాదులు కైదండ ఇస్తే అవరోహణ చేసి ఆ గుల్బ కీర్ణా పణ మార్గ పుష్ప పంక్తి మీద దర్జాగా నడచి పోవటం మొదలుగా సకల మైన వ్యవహారమూ రాజోచిత మైన ఉపచారమే. అంతే కాదు. పురకాంతలు పెండ్లి కుమారుడైన ఈశ్వరుణ్ణి ముచ్చట పడి చూడటం కుమార సంభవంలో ఎలా వర్ణించాడో అలాగే వర్ణించాడు రఘువంశంలో అజుడనే పెండ్లి కొడుకును చూచి నపుడు కూడా. పునరుక్తి అని కూడా చూడ కుండా శ్లోకాలకు శ్లోకాలే అటూ ఇటూ ఒకే బాణిలో దొరలి పోవటం చూస్తే నరేశ్వరుడికీ పరమేశ్వరుడికీ అభేదాధ్యవ సాయం కవి మనసులో ఉండి తీరాలి.

  అచేతన మైన హిమలయానికే చేతనత్వమూ - అందులోనూ దేవతాత్మత్వమూ కల్పించి ఆయనకు బ్రహ్మ దేవుడు దేవతలతో పాటు యజ్ఞ భాగం కూడా కల్పించాడని వర్ణించిన మహా కవి సచేతనులైన సూర్యాన్వయజు లైన రాజన్యులను ఈశ్వర స్వరూపులుగా భావించటంలో అభ్యంతర మేముంది. రాజులు శివస్వరూపులైతే వారి రాజ్య లక్ష్మి ఇక మహా కవి దృష్టిలో శక్తి స్వరూపిణే. మధ్యలో వచ్చిన గృహ లక్ష్మి మధ్యలోనే తొలగి పోవచ్చు. కాని అలా తొలగని లక్ష్మి వారికి రాజ్య లక్ష్మి. అది వారికి నిత్యానపాయినీ. తన కాంత ఇందుమతి వియోగాన్ని భరించలేక పలవిస్తుంటే ఈ సూత్రాన్నే ఆయనకు గుర్తు చేస్తాడు వసిష్ఠ మహర్షి. వసుధేయ మవేశ్యతాం త్వయా -వసుమత్యా హి నృపాః కళత్రిణః అని. ఇందులో సూక్ష్మ మేమంటే రాజు జ్ఞాన శక్తి కయితే రాజ్య లక్ష్మి క్రియా శక్తికి చిహ్నం. జ్ఞాన క్రియా శక్తులే పార్వతీ పరమేశ్వరులు. మరొక మాటలో శివ శక్తులు. వాటి సామరస్య మెప్పటికీ

Page 78

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు