#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

మైన అసుర సంపదను వర్ణిస్తూ వచ్చాడు. అందులోనూ ఒక్కొక్క రాజు జీవితంలో ఒక్కొక్క దైవ గుణాన్ని వర్ణించి అన్నీ కలుపుకొని చూస్తే సమ గ్రమైన దైవ గుణ సంపత్తి ఎలాంటిదో మనకు నిరూపించాడు. జీవితంలో ఎన్నో సంఘటనలు జరిగి ఉండవచ్చు. అవన్నీ ఏకరువు పెట్టటం అనావశ్యకం. పౌరాణిక మార్గం గాని కావ్య మార్గం గాదది. కాంతా సమ్మితంగా ఉపదేశించాలి కావ్యం. ఏమిటి. ఏది పాఠకుడి చిత్త సంస్కారానికి కావాలో అది. అది కూడా రమణీయంగా అందివ్వాలి రసజ్ఞుడికి. అలాంటి కావ్య మర్యాదలో ఆరి తేరిన వాడు కాళిదాసు. అందుకే దాని కనుగుణంగా ఒక్కొక్క రాజు జీవితాన్ని ఒక్కొక్క గుణాని కాదర్శంగా దిద్ది తీర్చాడు. ఆ తీర్చిన జీవిత చిత్రం మనః ఫలకం మీద శాశ్వతంగా హత్తు కొలిపాడు.

  దిలీపుని జీవితం ద్వారా ధర్మ దీక్ష - కార్య దీక్ష అంటే ఎలా ఉండాలో నిరూపించాడు కవి. సంతానార్థి అయి సేవించినా ఆ రాజు నందినీ ధేనువును కేవల మామేరకే చూడలేదు. ఛాయేవ తాం భూపతి రన్వ గచ్ఛత్. ఒక నీడలాగ దాన్ని అంటి పట్టుకొన్నాడు. తన భోగ భాగ్యాలన్నీ మరచి అన్ని కష్టాలనూ ఓర్చి నిరాడంబరంగా నిష్కల్మషంగా శ్రద్ధా భక్తులతో దాన్ని ఆరాధించాడు. మధ్యలో ఒక సింహం బారిన బడి అది ఆక్రందన చేస్తే తన శరీరాన్ని ఆ సింహాని కాహుతి చేయటానికి సిద్ధమయ్యాడు. ఆ సింహ మెవరో కాదు. నేనే నిన్ను పరీక్షించటాని కిలా చేశానని చెప్పిన నందిని ధేనువే. నా పాలు పిండుకొని | త్రాగు - నీకు కుమారుడు జన్మిస్తాడని లోభ పెడుతుంది. అయినా లోభపడక దిలీపుడు తన గురువు గారి అనుమతి తీసుకొని గాని ఆ పని చేయలేదు. ఈ సన్నివేశం ద్వారా ఒక దేశమేలే రాజు కెలాటి గుణ గణా లుండాలో సూచిస్తున్నాడు కవి. పెద్దల యెడ వినయం- కార్యదీక్ష నిరాడంబర జీవనం భూతదయ - స్వార్థ త్యాగం- ఇలాటి వున్న వాడే పాలకుడు. అలాటి వాడు పాలించి నప్పుడే యథా రాజా తథా ప్రజా అని పాలితులైన ప్రజలు కూడా అలాటి గుణాలు తప్పక అలవరుచుకో గలరని ధ్వని. దిలీపునిలో

Page 74

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు