రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
బయట పెడతాడీ ఆధ్యాత్మిక భావ మత్యద్భుతంగా. ఉద్భవ స్థితి సంహార కారిణీ మని శక్తి రూపంగా సీతను - యన్మాయా వశవర్తి - వందేతం రామాఖ్య మీశం హరిం అని శివ రూపంగా రాముణ్ణి స్పష్టంగా లోకానికి చాటాడాయన. కాబట్టి యక్షదంపతులను సీతారాములకు సంకేతంగా తీసుకొన్నా కాళిదాసు ఉద్దేశించింది శివ శక్తి సామరస్యమే మరేదీ గాదు. దాని ప్రపంచనమే ఈ మేఘ సందేశం.
పోతే ఇక మూడవది రఘువంశ మహా కావ్యం. ఇది వాటి రెంటి కన్నా పెద్దది. పందొమ్మిది సర్గల కావ్యమిది. దిలీపుడు మొదలు కొని అగ్ని వర్ణుడి వరకూ అనేక రాజన్యుల తాలూకు అద్భుతమైన చరిత్ర. మొదటి మూడూ దిలీపుని వైతే - నాలుగైదారులు రఘు చక్రవర్తి వైతే - ఏడెనిమిదులు అజుని దైతే - తొమ్మిది దశరథుని దైతే- ఇక చూడండి పది నుంచి పది హేను దాకా ఆరు సర్గలు రాముని చరిత్రే ఇందులో. రామాయణమంతా మరొక మూసలో * బోసి చూపాడు మనకు కాళిదాసు. ఆ తరువాత పదహారు కుశుని చరిత్ర. పదిహేడు నుంచి పందొమ్మిది దాకా పది మంది రాజుల చరిత్ర టూకీగా వర్ణించి అగ్ని వర్ణుడి శృంగార లాలసత్వంతో ఆఖరు చేశాడు కావ్యాన్ని కాళిదాసు. ఇంతమంది రాజులను వర్ణించినట్టు కనిపిస్తున్నా ఇంతమంది లేరు వాస్తవానికి. ఉన్నది ఒకే రాజు. ఒకే చరిత్ర. ఆ రాజెవరో గాదు. రఘు మహా రాజు. కనుకనే ఆ రాజు పేరే పెట్టాడు కావ్యానికి. కావ్యారంభంలో పేర్కొన్న అన్వయ లక్షణాలన్నీ పరిపూర్ణంగా అన్వయించిన పరిపూర్ణ జీవిత మామహా రాజుది. కనుకనే శైశవేభ్యస్త విద్యానాం అని విద్యాభ్యాసం మొదలు యోగేనాంతే తనుత్యజా మనే దాని కనుగుణంగా యోగ ధారణతో ఆ రాజు శరీర త్యాగం చేయటం దాకా బీరు పోకుండా వర్ణించి చూపాడాయన జీవితాన్ని. ఆయన జీవితంలోనే హస్తి పాదంలో సమస్త జంతువులు పాదాలూ అంతర్భవించి నట్టుగా అంతర్భవిస్తాయి తతిమా రాజుల జీవితాలన్నీ. పోతే ఒక రామ చరిత్ర మాత్రం ప్రత్యేకంగా చెప్పుకో వలసింది. అది భగవదవతార చరిత్ర. అందుకే దాని
Page 72