రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సందర్శనం వల్ల కలిగే ఆత్మ ప్రబోధమే. మరేదీ గాదు. అదే ఒక అభిజ్ఞానం లాగా పని చేసి మానుషమైన మన బుద్ధిని అతి మానుషమైన సిద్ధిని చేరుస్తుంది. యక్షుడెక్కడో చిత్రకూటంలో ఉన్నవాడు ఒక్క సారిగా తనకు దూరంగా ఉన్న అలకా పట్టణం వరకూ మానసికంగా పరుగెడుతాడు. అక్కడికీ ఇక్కడికీ నడుమ ఉండే మార్గమంతా వర్ణిస్తూ పోతాడు. అక్కడి వ్యక్తులూ - అక్కడి వాతావరణానికీ తాను ప్రస్తుతమున్న దానికీ సంబంధమే లేదు. అది దివ్యమైతే ఇది మానుషం. అది అమర్త్యమైతే ఇది మర్త్యం. ఆనందోత్థం నయన సలిలం - ఇలాంటి వర్ణనల ద్వారా కవి రెండింటికీ ఉన్న వైలక్షణ్యాన్ని మన మనసులో బాగా హత్తుకొనే లాగా చిత్రిస్తాడు. ఇదంతా ఏమిటి. ఎందుకు. అమర్త్యమైన స్థితే మనకు సహజమైన స్థితి. మనం జీవులం కాము. సాక్షాత్తు శివస్వరూపులమే. అయినా ఏదో అవిద్యా దోషం వల్ల మన స్థితిని మనం కోలుపోయి మన శక్తికి మనం దూరమై చిత్ర కూటం లాంటి ఈ సంసారారణ్యంలో చిత్ర హింసలకు పాలయ్యాము. మరలా ఏ మేఘుడి లాంటి స్థిత ప్రజ్ఞుడైన మహనీయుడో అనుగ్రహిస్తే మన పూర్వ వైభవమంతా జ్ఞప్తికి వచ్చి ఆవృత్త చక్షుః అన్నట్టు మన దృష్టి వెనుకకు మళ్ళించి క్రమంగా జ్ఞానోదయమై ఈ దుర్వాసనలకు స్వస్తి చెప్పి అమర్త్యమైన మన స్వరూప స్థితినే మన మందుకో గలమనే ప్రత్యభిజ్ఞా సూత్రాన్నే కవి భంగ్యంతరంగా ఈ చిన్న గేయ కావ్యంలో కూడా పొందుపరిచి మనకు అందజేశాడు. మాభూ ద్విద్యుతా విప్ర యోగః. నీవిద్యుత్కాంతతో నీకిక ఎప్పటికీ వియోగం లేకుండు గాక అని యక్షుడి చేత చివర అనిపించటంలో కూడా జీవు డీశ్వర పదవి అందుకొని ఆ తరువాత ఎప్పటికీ తన చైతన్య శక్తి నెడబాయకుండా నిత్య ముక్తుడై ఉండాలనే కవి ఆశీః. విశేషేణ ద్యోతతే ఇతి విద్యుత్. విశేషంగా ప్రకాశించేది తమసః పరమైన జ్ఞాన జ్యోతే. మరేదీ కాదు. అది క్షణికం కాక శాశ్వతంగా నిలిచి ఉండాలనే మన మాసించ వలసింది. సీతా రాములకు సంకేతాలుగా స్వీకరించినా నాయికా నాయకు లిందులో ప్రకృతి పురుషులకు సంకేతాలే. అవి శివ శక్తులే. రాము డాత్మ రాముడే. సీత ఆత్మ శక్తే. తులసీ దాసు రామ చరిత మానసం పీఠిక లోనే
Page 71