రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మాటాడు తున్న పాత్ర. మేఘుడా అచేతనుడు కాబట్టి మాటాడ లేడు. యక్షాంగనా మాటాడ గలిగినా మాటాడ నివ్వడు కాళిదాసు. యక్షుడే ఆమె తరపున కూడా మాటాడ వలసింది. దీనిని బట్టి ఇదంతా యక్షుడి సాద మాత్రమే. అయినా దానిలో మిగతా వారిద్దరి మూర్తులు మనకు సజీవంగా దర్శన మిస్తూనే ఉంటాయి. ఈ యక్షు డెవరో కాదు. కవి దృష్టిలో శివ స్వరూపుడే, యక్ష కాంత శక్తి స్వరూపిణే. పేరు చెప్పకుండా కశ్చిద్యక్షః అనటంలోనే అనిర్వచనీయమైన భగవత్తత్త్వాన్ని స్ఫురింప జేస్తున్నాడు కవి. కేనోపనిషత్తు లో వస్తుంది మనకు యక్షమనే మాట. యజింప దగినది పూజింప దగినదని అర్థం. భగవచ్చక్తి పరంగానే వాడారా మాట అక్కడ. అయితే అది స్వాధికారాత్ ప్రమత్తః. తన స్వరూప స్థితిలో పరాకు చెందింది. ప్రమాదో వై మృత్యుః అన్నట్టు పరాకు చెందే సరికి శాపేనాస్తం గమిత మహిమా. అదే తన పాలిటికి శాపమై తనకున్న మహిమను కోలుపోయింది. అంతేగదా. అచ్యుతుడైన దేవుడే అవిద్యా ప్రభావం వల్ల చ్యుతుడై జీవుడయ్యాడు. మాయైషా తస్య దేవస్య యయాయం మోహితః స్వయం అని గదా అద్వైత సిద్ధాంతం. తన మాయా శక్తే తన కొంప ముంచింది. దానితో తన చైతన్య శక్తికి దూరమై ఈ సంసారమనే అరణ్యంలో వచ్చి పడ్డాడు జీవుడనే పేరుతో ఆ ఈశ్వరుడే. ఇదే యక్షుడు తనపట్టణానికీ తన పత్నికీ దూరమై ఎక్కడో రామగిర్యాశ్రమంలో కాపురం చేయటం. తన మహిమ కోల్పోయి దేబిరించటం.
అయితే కోలుపోయిన తన స్వరూప స్థితిని మరలా పొందాలని ఉంటుం దెవరికైనా. అంత వరకూ పరిపూర్ణత లేదు. ఇలాటి ప్రత్యభిజ్ఞకు దోహద కారి గురూప సదనమే. ఆ గురువు ఎంతో ఉన్నతుడై ఉండాలి. మన సుకృతం కొద్దీ తటస్థ పడాలి. మన ముత్తమాధి కారులమయితే మౌనోపదేశంతోనే ఉద్దరించ గలడు మనలను. ప్రస్తుతం మేఘు డలాటివాడే. అతణ్ణి చూడగానే దద్యౌ ధ్యానంలో పడి పోయాడు యక్షుడు. తన దైన్యమంతా వెళ్ళ బోసు కొన్నాడు. ఏవేవో జ్ఞాపకాలు వచ్చాయి పూర్వ వృత్తాంతాలన్నీ. ఇది ఆచార్య
Page 70