రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
-భవితవ్య ప్రియ సంగమం వపుః. మరలా నీ ప్రియునితో కలుసుకొంటావు. అంతదాకా నీ ఈ శరీరాన్ని కాపాడుకో. సూర్యుడెంత పీల్చినా నదీ జలం మరలా /వర్షర్తువులో అది పుష్కలంగా ప్రవహించదా. ఏమి ఉపమానమో చూడండి ఇది. సూర్యుడే పీలుస్తాడు జలం. సూర్యుడే మరలా వర్షిస్తాడు. అలాగే ఈశ్వరుడే దహించాడు మదనుణ్ణి. మరలా ఆ ఈశ్వరుడే అనుగ్రహిస్తాడని సూచన. అనుగ్రహించా లంటే పార్వతిని చెట్టపట్టాలి గదా. అప్పటికి శివశక్తుల సంగమ మవశ్యం భావి అని తెలుస్తున్నది. దీని కుపోద్బలకం పార్వతి తపస్సు. అవాప్యతే వా కథ మన్యధా ద్వయం తథా విధం ప్రేమ పతిశ్చ తాదృశః అని పంచమ సర్గాది లోనే సూచిస్తాడు తప్పకుండా శివ సాంగత్య మావిడకు తపస్సు ద్వారా లభిస్తుందని. అందుకే అంత దీర్ఘమైన ఆ వర్ణన. పోతే బ్రహ్మచారి రూపంలో వచ్చి ఆయన శివదూషణ చేయటం - ఆవిడకు ప్రత్యక్షం కావటం మరలా విడిపోవటం. ఆ తరువాత సప్తర్షుల ధర్మమా అని పరిణీతులై ఇద్దరూ మరలా కలియటం. కామం వల్ల కలిసే కలయిక నిత్యం కాదు. తపస్సుచేత కామం నిష్కామ మైతేనే అది కలయిక. దానికిక ఎడబాటు అనేది లేదని సూచిస్తూ సమాప్తం చేస్తాడు కవి తన కావ్యాన్ని. ఇలా ఎప్పటి కప్పుడు పార్వతీ పరమేశ్వరుల యోగ ప్రతియోగాలను వర్ణించటం చూస్తే కవి తన ప్రత్యభిజ్ఞా సిద్దాంతానికీ కావ్యాన్నంతటినీ ఉదాహరణ ప్రాయంగా భావించాడని చెప్పక చెబుతున్నది. అంతే కాదు. శివ శిక్తుల నీ కావ్యంలో పరోక్షంగా కాక సాక్షాత్తుగానే నాయికా నాయకులుగా స్వీకరించి వారి వృత్తమే సాక్షాత్తుగా వర్ణించాడు కాళిదాసు. ఈ నమూనాతోనే చూచండి మీరు నా మిగతా కావ్యాలనని ధ్వనింప జేయటానికో ఏమో.
మిగతా కావ్యాలంటే ఏమిటవి. రఘువంశమూ మేఘ దూత మే గదా. మేఘ దూతంలో కూడా ఇదే బాణీ. అయితే చాలా నిగూఢంగా సాగింది వ్యవహారం. అసలే చిన్న కావ్యమది. అందులో ఉన్నవి కూడా మూడే పాత్రలు. అందులో రెండు మాటాడనివి. ఒకటి మాట్లాడేది. యక్షుడొకడే చివర దాకా
Page 69