#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  కాబట్టి ఇంతకూ కుమార సంభవం సర్దాష్టక సమాప్తమే. హిమవత్పర్వత వర్ణనతో ప్రారంభమయి అది శివపార్వతుల నిధువన వర్ణనతో సమాప్త మవుతున్నది. హిమవంతు డెవరో గాదు. పార్వతీ జనకుడు. ఆయనే పెండ్లి పీటల మీద కూర్చొని పార్వతిని పరమేశ్వరుడికి కన్నెధార పోసింది. ఆ ఈశ్వరు డెక్కడో కాదు. సతీవియోగ మయినప్పటి నుంచీ దిక్కుతోచక అక్కడే తపస్సు చేస్తున్నాడు. పార్వతి అక్కడే ఆయనకు పరిచర్య చేసింది. మన్మధుడు వచ్చి శివ తపోభంగం చేసి ఆయన ఆగ్రహానికి గురి అయిందీ అక్కడే. తరువాత పార్వతి తపస్సు చేసిందీ తపః ఫలంగా శివుడు ప్రత్యక్ష మయిందీ - వారిరువురి వివాహమూ చివరకు వారి వినోద విహారమూ పర్వతం మీదనే. కొనా మొదలు హిమవంతుడే . కనుకనే హిమవద్వర్జనతో ఆరంభించాడు కావ్యాన్ని. అందులోనూ అది కేవల పర్వత వర్ణన గాదు. ఆయన నగాధి రాజత్వాన్నీ దేవతాత్మత్త్వాన్నీ రెండు లక్షణాలనూ దృష్టిలో పెట్టుకొని రెండింటికీ అనుగుణంగా సాగించాడు వర్ణన. దేవతాత్ముడు కాకుంటే పరాదేవత ఆయనకు జన్మించదు. పరమేశ్వరు డాయన కల్లుడు కాలేడు. సప్త మహర్ష లాయనతో సంప్రతించ లేరు. మరి నగాధి రాజు కాకుంటే పది మందిలో సభా గౌరవం పొందలేడు. ముక్కోటి దేవత లాహూతులయి వస్తే అంత వైభవోపేతంగా కుమార్తె వివాహం జరపలేడు. పోతే ఆద్యంతాలలో హిమవంతుడైతే పూర్వాపరౌ వారినిధీ విగాహ్య అన్నట్టు ఆ రెండంచులు తాకుతూ సాగుతుంది పార్వతీ పరమేశ్వరుల కథా ప్రవాహం. ప్రధమ సర్గలోనే వారిద్దరినీ మన కండ్ల ముందు ప్రత్యక్షం చేస్తాడు కవి. రెండవ సర్గలో వారి విషయమే బ్రహ్మ దగ్గర ప్రస్తావన వస్తుంది. మూడవ దంతా వారిద్దరినీ కలపటానికి మన్మధుడు చేసిన గోల. అది విఫలం కాగా నాలుగవ సర్గలో అతని భార్య రతి చేసిన ఆక్రందన. అందుకు గగన వాణి అభయ మిస్తే దాని కనుగుణంగా అయిదులో పార్వతి చేసిన తపశ్చర్య. పరమేశ్వరుడు వచ్చి చేసిన పరీక్ష. అన్యోన్యానురాగ బీజావాపం. షష్టలో దాన్ని సఫలం చేయటానికి

Page 67

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు