రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సమాగమ మని. కుమారుని కోసం పార్వతీ పరమేశ్వరుల కలయిక ఏదున్నదో అది కుమార సంభవమంటే వారిరువురూ కలిస్తే కుమారు డెలాగూ జన్మిస్తాడు. అది బ్రహ్మదేవుడి వాక్యాల్లో ముందుగానే సూచించాడు కవి. కనుకనే ధ్వనిగర్భితంగా వారిరువురి మైధున వర్ణన తోనే కావ్యానికి భరత వాక్యం పలికాడు మహాకవి. శివ శక్తుల అవినాభావ నిత్య సాంగత్యానికి గొప్ప సంకేత మది. అదే వివక్షితం మహా కవికి. ఇదే సరిగా మేఘ సందేశంలో కూడా చేసి చూపాడాయన. అక్కడా మేఘుణ్ణి తన విద్యుత్కళత్రంతో నిత్యమూ కలిసి ఉండమని యక్షుడి చేత ఆశీస్సు వలికిస్తూ కావ్యాన్ని ముగించాడు. మేఘుడు శివతత్త్వాని కనుకొంటే విద్యుల్లత శక్తి తత్త్వానికి ప్రతీక. వాటి నిత్య సాంగత్యం శివశక్తుల సాంగత్యమే. కనుకనే దానినే ముగింపుగా భావించాడు కవి.
ఇది గ్రహించలేక అందులో కూడా ఉత్తర మేఘమంటూ మేఘుడి రాయబారాన్ని ఇంకా సాగాదీస్తూ ఎవరో కొన్ని శ్లోకాలు వ్రాసి జొనిపారు. మేఘ సందేశ మంటే మేఘుడు వాస్తవంగా వెళ్ళి యక్ష గృహిణికి సందేశ మందించా డనికాదు. అందివ్వమని యక్షుడతణ్ణి ప్రాధేయ పడటం మాత్రమే. కాకపోయినా అచేతన మయిన మేఘ మేమిటి. సందేశం మోసుకు పోవట మేమిటి. అంద జేయట మేమిటి. ఎంత అసంభవం. అసంభవమని నీవూ నేనూ కాదు. కాళిదాసే చాటి చెబుతున్నాడు మనకు. ధూమ జ్యోతి స్సలిల మరుతాం సన్నిపాతః క్వ మేఘః సందేశార్ధాః క్వ పటు కరణైః ప్రాణిభిః ప్రాపణీయాః. అయితే మరి యక్షు డాయనతో ఎలా మాట్లాడాడు. అతడెలా ఆలకించాడు. ఇతడు మాటాడాడే గాని అత డాలకించలేదు. అదైనా ఎందుకు మాటాడాడు. కామార్తాహి ప్రకృతి కృపణాః. కామార్తుడతడు. అందుకే చేతనాచేతన వివేకం కోలుపోయి ఆ మేఘానికి తన సోది అంతా వినిపిస్తూ వచ్చాడని సంజాయిషీ ఇస్తాడు కవి. అలాంటప్పుడిక మేఘు డలకాపురికి వెళ్ళటమేమిటి వినిపించట మేమిటి. అర్ధంలేని మాట. ఇది కవి హృదయాన్ని బాగా అర్థం చేసుకోలేక చేసే అవివేక ప్రసంగం .
Page 66