#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

లందరిలో అన్వయించి ఉన్నాయని భావం. అందరిలోనూ ఆ లక్షణాలే ఉన్నాయి గనుక ఎందరి చరిత్రలు వర్ణించినా ఆ చరిత్రలన్నీ కలిసి ఒకే చరిత్రగా భాసిస్తాయి సహృదయుడికి. ఇదే అక్కడ వస్త్ర్వైక్యం. నానాత్వంలో ఏకత్వం. ఆ ధ్యేయంతోనే కాళిదాసు మొదట సూర్యవంశజు లందరి గుణాలనూ కలిపి మూకుమ్మడిగా నాలుగైదు శ్లోకాలలో చాలా ఉదాత్తంగా వర్ణిస్తూ పోయాడు. సోహ మాజన్మ శుద్ధానాం మొదలు కొని యోగేనాంతే తనుత్యజా మనే వరకూ సాగిన ఈ పరంపరలో మనం నిశితంగా పరిశీలిస్తే ఈ చెప్పిన ఉదాత్తమైన గుణా లొక్కొక్క రాజన్యు డొక్కొక్కటి పుడికి పుచ్చుకొని జన్మించాడా అనిపిస్తుంది. దిలీపుడా నాక రధ వర్త్ముడు ఆ ఫలోదయ కర్ముడూ అయితే రఘుమహారా జాసముద్ర క్షితీశుడు త్యాగాయ సంవృతార్థుడూ యధా కామార్చితార్థుడూ. పోతే అజుడు యౌవనే విషయైషీ- యధాకాల ప్రబోధి అనుకొంటే - దశరధుడు సత్యాయ మిత భాషి, మరి రాముడాజన్మ శుద్దుడు కుశుడు యశసే విజగిషువు. ఇలా వంశ గౌరవాన్ని అందరికీ పంచి పెట్టాడు కాళిదాసు. మరి రఘుమహారాజు నైతే ఈ చెప్పిన సకల గుణాలకూ సంగమ క్షేత్రంగా తీర్చి దిద్దాడు. శైశవేభ్యస్త విద్యానామనే ప్రణాళిక కంతా తార్కాణంగా చిత్రించా డాయన జీవితం. మిగతా వారి కథలన్నీ ఇటూ అటూ ఆ రాజు కథా ప్రదీపం చిమ్మిన కిరణ కాంతులే. కనుకనే నేమో తన కావ్యానికి రవివంశ మని గాక రఘువంశమని నామకరణం బుద్ధి పూర్వకంగా చేసినట్టు కనిపిస్తుంది కాళిదాసు.

  ఇంతకూ రఘువంశంతో సహా మూడూ కావ్యమార్గంలో సాగిన రచనలే. మూడింటిలోనూ ఉన్నది వస్వైక్యమే. వస్వైక్యం మీద దృష్టికిక విక్షేపమంటూ ఉండదు. అంటే అది కేంద్రాన్ని వదలి ఇటూ అటూ చెదరి పోదు. పోయినా అది ఎంతో దూరం పోరాదు. ఎంత దూరం పోతే అంత దూరం కేంద్రంతో ముడిపడే ఉండాలది. ఏ సన్నివేశం కల్పించినా ఏ పాత్రను ప్రవేశ పెట్టినా - ఏ వర్ణన చేసినా ఎక్కడ ఏ బావాన్ని ఆవిష్కరించినా- అదంతా

Page 64

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు