రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
కూడా ఉంటుంది. చిక్కదన మెలా వస్తుంది కథలో. ఒకే ఒక నాయికా నాయకుల చుట్టూ తిరుగుతున్నప్పుడు. మిగతావి ఏవైనా వారి చుట్టే తిరుగుతూ వారికి దూరంగా పోనప్పుడు. దీనినే వస్వైక్య మంటారు. ఇలాటి వస్త్ర్వైక్యం చూచుకొన్నాడు మొదట కాళిదాసు తన కావ్యాలలో. ఆ మాటకు వస్తే ఆయన రఘువంశంలో ఇతి హాస ఫక్కిని ప్రదర్శించాడు. కుమారసంభవంలో కావ్య ఫక్కిని చూపాడు. మేఘ దూతంలో గేయ ధోరణి ననుసరించాడు. ఇప్పుడు ఆంగ్ల సాహిత్యంలో వినిపించే ఎపిక్ క్లాసిక్- లిరిక్ అనే మూడు శాఖలకూ ఇవి జవాబు చెబుతాయి. చూడబోతే మూడు మార్గాలలో తనకు సమానమైన నైపుణ్య ముందని చూపటానికి చేశాడా ఈ మూడు రచనలు అనిపిస్తుంది. కాని చమత్కార మేమంటే ఆయన ఈ మూడింటిలోనూ కావ్య లక్షణమైన వస్వైక్య సూత్రాన్ని విడిచి పెట్టక పోవటం. మేఘ సందేశంలో యక్షుడు యక్ష కాంత - వీరిరువురి మధ్యా రాయబారం నడప వలసిన మేఘ దూతా వీరి కథే. వీరి వర్ణనే. మరొక సన్నివేశమే లేదు. అలాగే కుమార సంభవంలో పార్వతీ పరమేశ్వరులు-వారి యోగ వియోగ వృత్తాంతమే. మధ్యలో తారకాదుల వృత్తాంతాలు వచ్చినా దాని కనుబంధాలే. కాబట్టి రెండూ వస్వైక్య మున్న కావ్యాలే నంటే సరిపోతుంది. కానీ రఘువంశంలో వస్త్ర్వైక్యమెలా చూపగలమని కొందరి సందేహం.
వాస్తవంలో అక్కడా ఉంది వస్వ్యైం. రఘువంశమని పేరు పెట్టటంలోనే ధ్వనిస్తుందది. వంశ చరిత్రే గాని అది వ్యక్తుల చరిత్ర కాదు. వంశ లక్షణాలకు వ్యక్తు లందరూ కేవలం ప్రతీకలు. వారందరిలో కవి ఒకే ఒక వంశ వైభవాన్ని నిరూపించ దలచాడు. కనుకనే రఘూణా మన్వయం వత్యే. రఘువంశజుల వంశాన్ని కావ్య రూపంగా వర్ణిస్తా నన్నాడు గాని తద్వంశీయులైన దిలీపాది రాజన్యుల నని అనలేదు. అలాగైతే దిలీప చరిత్ర అనో రఘు చరిత్ర అనో రామ చరిత్ర అనో నామ కరణం చేసేవాడు. అన్వయమనే మాట ఇక్కడ ఎంతో అన్వర్థమైన మాట. అన్వయమంటే ఆ వంశ లక్షణాలన్నీ ఆ రాజన్యు
Page 63