రచనా ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ప్రధాన కథ ఒకటున్నా దాని కానుషంగిక మైన కథలు సవా లక్ష వస్తాయి. అవి వచ్చీ పోయి ప్రధానేతి వృత్తమంతగా విస్తరించి దాన్ని కప్పి వేస్తాయి కూడా. శాఖోప శాఖాత్మకంగా పరుచు కొన్న ఈ వస్తు నానాత్వం లో మనం కవి వివక్షితమైన కావ్యార్థ మేదో వెతుకుకో వలసి వస్తుంది. వెతకినా అంతగా మనసుకు స్ఫురించక పోవచ్చు. పట్టక పోవచ్చు. రామాయణంలో అంతకన్నా మహా భారతంలో - ఇది బాగా హెచ్చుగా కనిపిస్తుంది. ఎన్నో కథలు ఎన్నో సన్ని వేశాలు చుట్టూ మట్టి ఊడల్లాగా దిగి మధ్యలో దాగిన కథ అనే మ్రాను మనకు కనపడ నీయవు. అంతే కాదు. కథా మధ్యంలో తరుచుగా థర్మోపదేశాలు - నీతి బోధలు తత్త్వ బోధలు విపరీతంగా చోటు చేసు కొంటాయి. వర్ణన లు కూడా ఎక్కువగా సాగుతాయి. ఇవన్నీ కథా ప్రవాహాని కానకట్టలలాగా అడ్డు తగులుతాయి దానివల్ల పూర్వాపరాను సంధాన మేర్పడటం కష్టం భావుకుడికి. అంతేకాదు. ఆయా విషయాలు వర్ణించటంలో విషయ ప్రతిపాదనలో ఎంతో విస్తృతి పునరుక్తీ కూడా దొరలటం చూస్తామీ ఇతిహాసాల్లో పురాణాల్లో. పురాణా లితి హాసాల కంటే ఈ విషయంలో ఇంకా ముదురు పాకాన పడ్డాయి. భావుకుడి మనసు నవి కథనుంచి ఎన్నో మైళ్ల దూరం లాగుకొని పోయి ఏ అరణ్య మధ్యంలోనో వదిలేస్తాయి. అక్కడి నుంచి వాడు మళ్ళీ దారి వెదుక్కొంటూ రావాలి అసలు చోటికి.
ఇలాటి ఈతి బాధలన్నీ బాగా గమనించాడు కాళిదాసు పురాణేతి హాస వాఙ్మయంలో. అది తన ఆశయాన్ని పరిపూర్ణంగా ధ్వనింప జేయటానికి పనికి వచ్చే సాధనం కాదని భావించాడు. కనుకనే రామాయణాదుల వల్ల కవితా మార్గంలో అభ్యాసం కావించినా తన ఆశయాన్ని ఆవిష్కరించటానికి ప్రాచీనమైన బాణికి స్వస్తి చెప్పి నవీనమైన మరొక బాణిని స్వీకరించాడు. అదే కావ్య బాణి. కావ్యమన్నా ప్రబంధమన్నా ఒక్కటే. ప్రబంధమనే మాట చాలా చక్కని మాట. ప్రకృష్టమైన బంధమేదో అది ఫ్రబంధం. చక్కని కూర్పు. చక్కని చిక్కని కూడా. కథా వస్తువును చిక్కగా కూర్చాలి. అప్పుడే అది చక్కగా
Page 62