#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

హెచ్చరిస్తాడు కూడా. ప్రణయమంటే ప్రార్ధన కోరట మని అర్థం. కోరవలసిం దేమిటి మనం. మన స్వరూపాన్నే గదా. ఆ స్వరూపం విస్మృతమైన మన శివ శక్తి భావమే. దానికి కవి కల్పించిన ప్రతీకలే పాత్రలన్నీ. అన్నీ అంటే ఎన్నో గా కనిపిస్తున్నా ప్రధాన పాత్రలు రెండే నాయికా నాయకులు. ఈ భావాన్ని మన బుద్ధులకు నయనం చేసే వారు. వారి కా మార్గంలో సహకరిస్తూ వచ్చిన వారే తతిమా వారందురూ ఆయన కావ్యాలలో. కాగా ఈ నాయకు లందరూ శివతత్త్వాన్ని గుర్తు చేసే ప్రతీకలైతే నాయిక లందరూ శక్తి తత్త్వానికి సంకేతాలుగా భావించాడు కాళిదాసు. వారిద్దరి యోగ వియోగ పునర్యోగాలను చిత్రిస్తూ పోవటమే కాళిదాసు కథా వస్తువంతా. కధ అంటే అప్పటికి కాళిదాసుకు శివపార్వతుల కథే. నాయికా నాయకులంటే శివపార్వతులే. రస భావ సంపత్తి అంటే ఆ శివ శక్తుల రెండింటి అవినాభావ సంబంధమే. శాశ్వతా నందాను భవమే. ఇష్కే మిజాజీ ఇప్కే హకీకీ అని సూఫీ మహా కవులు ప్రేమలో రెండంతస్తులు వర్ణిస్తారు. మొదటిది భౌతికం. రెండవది తాత్త్వికం. భౌతికంగా ఏదైనా వర్ణిస్తూ పోయామంటే అది తాత్త్వికానికి స్పోరకంగా చేస్తున్న వర్ణనే. ఇది గమక మైతే అది గమ్యం. కాగా దీనిని కేవలం సంకేతంగానే చూచి ఈ సంకేతం ద్వారా ఆ సత్యాన్ని అందుకొని ఆనందించ మంటారు వారు. ఇది కాళిదాసే వారి కందించిన భావమేమో నని కూడా నా కనుమానం. ఎందుకంటే ప్రేమకూ ప్రణయానికీ మారు పేరయిస శృంగారాన్ని ఆ రెండు భూమికలను సోకే లాగా పోషించి రసజ్ఞ లోకానికి ప్రదర్శించిన సవ్యసాచి ప్రాచీన కాలంలో కాళిదా సాక్కడే. ఆయనకే ఉన్న దలాంటి లోకోత్తరమైన భావం. ఆయన నాటకాలలోని నాయకు లెంత వయసు వచ్చినా పైలా పచ్చీసు శృంగార నాయకులుగా కనిపిస్తుంటారు. భౌతికమైన పచ్చి శృంగారమే ప్రదర్శిస్తుంటారు. అర్థం చేసుకో లేక పోతే ఏమిటా ఇంత అశ్లీల మిది చూపటానికేనా కాళిదాసింత నాటకం వ్రాసిందని పిస్తుంది. కాని ఈ భౌతిక వర్ణన వెనకాల లోతుకు దిగితే అంతా ఆధ్యాత్మిక వాతావరణమే నని ఏ భావుకుడికో గాని అంతు పట్టదు. అందుకే కావ్యజ్ఝత కాదు కావ్యార్థ తత్త్వజ్ఞత కావాలని ఆనంద వర్ధను డంతగా

Page 60

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు