స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
వీరిని జ్ఞాన యోగుల క్రిందనే జమ కట్టాడు గాని కేవల సమాధి యోగుల కోవలో చేర్చ లేదు. ఇదీ మనమర్థం చేసుకోవలసిన విషయం.
ప్రస్తుతం మన కాళిదాస మహా కవి ఇలాంటి అద్వైత జ్ఞాన సంపన్నుడైన యోగ మార్గావలంబి . సిద్దాంత మాయనది అద్వైతమే సందేహం లేదు. వేద్యంచ వేదితా చేసి - ప్రాక్సృష్టే : కేవలాత్మనే- ఆత్మాన మాత్మన్యవ లోక యంతం - అద్వైత జ్ఞానం లేని వాడైతే ఇలాంటి మాట అనలేడు. అనటానికి మనసు రాదు. కాని వచ్చిన గొడవేమంటే దాన్ని అనుభవానికి చెచ్చుకోవటంలో మాత్ర మాయన పాఠకులకు యోగాభ్యాసాన్ని సిఫారసు చేస్తాడు. యోగేనాంతే తనుత్యజామని రఘువంశ రాజుల నిష్క్రమణను వర్ణించటం లోనే అర్థ మవుతుం దాయనకు యోగం మీద ఉన్న మోజు. యోగంతో శరీరాన్ని వదిలేస్తారట ఆ రాజులు. యోగమంటే ఇక్కడ సమాధియోగం. జ్ఞాన యోగం కాదు. జ్ఞానంలో అయితే వదిలేసే ప్రసక్తే లేదు. శరీర మనేది ఒకటుంటే గదా జ్ఞానికది వదిలేయటానికి. సర్వం యదయ మాత్మా తానూ తాను చూచే సమస్త ప్రపంచమూ ఆత్మే జ్ఞానికి. అలాంటప్పుడిక శరీర మెక్కడిది. అదీ ఆత్మా స్వరూపమే. కరచరణాదులుగా కనపడ దతనికి. శుద్ధ చైతన్యంగానే అనుభవానికి వస్తుంటుంది. అలాంటి దాన్ని వదిలేయట మంటే అది కుందేటి కొమ్మును వదిలేశాడని చెప్పటం లాంటిది. శరీరమూ శరీరంతో పాటు సమస్తోపాధులూ ప్రారబ్దం తీరగానే జ్ఞానికి అతని చైతన్య సాగరంలో తరంగాల లాగా కలిసి పోతాయి. నతస్య ప్రాణా ఉత్ప్రేమంతి - ఇహైవ సమవ నీయంతే అని శాస్త్రం. అలాంటప్పుడు తనువును త్యజించా రంటా డేమిటి కాళిదాసు. ఇది జ్ఞానంతో గాదు. యోగంతో నని జవాబు. యోగంతో గనుకనే ఒక తనువనే కర్మ - త్యజించటమనే క్రియా - త్యజిస్తున్నానే ఒక కర్త - ఇలాటి వ్యవహార మేర్పడుతున్నది. ఇదంతా ద్వైత భూమిని దాటి పోని వ్యవహారం. అద్వైత భూమికలో నైతే కర్మ కర్త క్రియా భేద మనేదాని కాస్కారమే లేదు. అది తెలిసే యోగేన అని జాగ్రత్తగానే మాట ప్రయోగించాడు మహా కవి.
Page 24