#


Index


స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

గుహ్య యోగం కేవల జ్ఞాన నిష్టను నిరూపిస్తుంది. భగవత్పాదులు దానికి అవతారిక వ్రాస్తూ ఇలా అంటారు. అష్టమే నాడీ ద్వారేణ ధారణా యోగః సగుణ ఉక్తః - తస్యచ ఫలం అగ్న్యర్చి రాది క్రమేణ కాలాంతరే బ్రహ్మ ప్రాప్తి లక్షణమేవ అనావృత్తి రూపం నిర్దిష్టం. తత్ర అనేనైవ ప్రకారేణ మోక్ష ప్రాప్తి ఫల మధిగమ్యతే నాన్యధేతి తదాశంకా వ్యావివర్త యిషయా శ్రీ భగవా నువాచ. అష్టమాధ్యాయంలో నాడీ శుద్ధి ద్వారా సగుణమైన ధారణా యోగం చెప్పాడు భగవానుడు. దాని ఫలం అర్చిరాది క్రమేణ కాలాంతరంలో అనా వృత్తి రూపమైన బ్రహ్మ సాయుజ్యం పొందటమని కూడా పేర్కొన్నాడు. అయితే బ్రహ్మ సాయుజ్య మిలాగే పొందాలి మరొక విధంగా పొందలేమేమో అని అశంక కలగ వచ్చు శ్రోతలకు . అలాటి ఆశంకను తొలగించటానికే ప్రస్తుతమీ నవమాధ్యాయంలో మరలా కేవల జ్ఞాన నిష్ఠను ప్రతిపాదిస్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు.

  దీనిని బట్టి మనకర్థ మవుతున్న దేమంటే సమాధియోగ మెంత గొప్పదైనా అది జ్ఞానాని కెంత ఆవశ్యక మైనా సగుణ రూపంగా సాగే ప్రక్రియ అది. జ్ఞానం లాగా నిర్గుణంగా సాగేది కాదు. కాకున్నా నిర్గుణంగా పర్యవసిస్తుంది చివరకు. అలా నిర్గుణంగా పర్యవసించేటపు డెందుకీ సగుణ మార్గాన్ని అవలంబించట మంటే అది కేవలం శిక్షణ కోసం. జీవోపాధులైన మనః ప్రాణాల స్పందన జీవుడి బ్రహ్మనిష్ఠ కడ్డు తగులు తుంటాయి. వాటి అడ్డంకి తొలగించుకొనే ప్రయత్నమే ఈ యోగ సాధన. ఇది సగుణమైన మార్గంలోనే కాని గమ్యంలో కాదు గనుక తెలిసే దీన్ని తాత్కాలికంగా అవలంబిస్తారు కొందరద్వైతులు. మధ్యలో సాధన కోసమలా అవలంబించినా ఆద్యంతాలలో అద్వైత జ్ఞానాన్నే నమ్ముకొన్న వారు కాబట్టి వీరు పాతంజలాది యోగుల లాగా ద్వైత మార్గ గాములు కారు. అద్వైతాను యాయులే. కనుకనే యత్సాంఖ్యైః ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే అని గీతాచార్యుడు

Page 23

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు