స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చిత్ర మేమంటే అద్వైత వేదాంతులలో రెండు తెగల వారున్నారు. ఒకరిది కేవలం
విచార మార్గం. జ్ఞానాన్ని అందుకొన్న తరువాత అదే అనుష్ఠానంగా భావిస్తారు
వారు. జ్ఞానానంతరం అనుష్ఠాన మంటూ వేరే లేదు వారికి వారికున్న అనుష్ఠాన
మల్లా శ్రవణ మననాలతో అందుకొన్న బ్రహ్మ జ్ఞానం లోక దేహ వాసనలతో
జారి పోకుండా పదే పదే అనుసంధానం చేసుకోవటమే. దీనికే నిది ధ్యాసనమని
పేరు. ఇలాటి వారికి జ్ఞాన నిష్ఠ తప్ప యోగమూ ఉపాసనా అంటూ మరొక
ప్రక్రియ ఏదీ లేదు. అక్కర లేదు. పోతే మరి కొందరున్నారు అద్వైతులలో.
వారు శ్రవణ మననాల ద్వారా వారిలాగా జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆర్జించిన వారే.
అంతవరకూ తేడా లేదు. కాని అది జీవితంలో అలాగే అనుభవానికి
తెచ్చుకోవాలంటే బరువు పడతారు వారు. నిది ధ్యాసనకు మారుగా
అందుకోసం యోగ మార్గాన్ని అవలంబిస్తారు. ధారణా ధ్యాన సమాధుల
ద్వారా నాడీ శుద్ధి - ప్రాణ శుద్ధి- చిత్త శుద్ది కావించుకొని చివరకా యోగా
భ్యాస బలంతో బ్రహ్మ రంధ్రం ద్వారా ప్రాణో త్య్రమణం చేసుకొని ఆదిత్య
మండలాన్ని భేదించుకొని సత్యలోకం చేరి అక్కడ మరలా ఈ యోగం
జ్ఞానంగా మారి తరిస్తారు. అంటే ఏమన్న మాట. సిద్దాంతం నిర్గుణ జ్ఞానమని
అంగీకరించినా దాన్ని సగుణ మార్గంలో శిక్షణ పొంది అనుభవానికి
తెచ్చుకొంటారు వారు. ఇందులో మొదటి వారిది సాక్షాన్మోక్ష ప్రదమైతే -
వీరిది పరంపరయా. సద్యో ముక్తి వారిదైతే క్రమముక్తి వీరిది. చివరికిద్దరి
అనుభవమూ ఒక్కటే అయినా మొదటి నుంచీ చివరి దాకా అద్వైత రూపంగా
వారిది నడిస్తే - మొదట ద్వైత రూపంగా నడచి ఆఖరుకది అద్వైత
రూపంగా పరిణమిస్తుంది వీరిది.
భగవద్గీతాది వేదాంత గ్రంధాలలో ఈ రెండు ప్రక్రియలూ కనపడతాయి మనకు. ఇంతెందుకు. ఎనిమిదవ అధ్యాయమైన అక్షర పరబ్రహ్మ యోగం సమాధి యోగాన్ని వర్ణిస్తే ఆ వెంటనే తొమ్మిదవదైన రాజ విద్యా రాజ
Page 22