#


Index


స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వేడుక జరిపే సేవకు లవుతుంటారు. సందర్భాన్ని బట్టి సేవ్య సేవక భావం వారి కేర్పడుతుంది. అది వారికొక వినోదం. వారిలో వారికి భేదం లేనప్పు డితరుల కెందుకీ పనికి మాతిన భేద దృష్టి అని వాపోతాడు కాళిదాసు.

  అసలు మూర్తిని మూర్తిగా చూచినప్పుడే ఇలాంటి పొరబాటు. అమూర్తమైన తత్త్వమే మూర్తమయినదని భావిస్తే ఇలాటి పొరబాటు దొరలదు. అలా ఏకత్వ దృష్టితో భావించిన మహానుభావుడు కాబట్టి ఆయన కుమార సంభవంలో బ్రహ్మ రుద్రులను వర్ణించినా అదే అద్వైత భావం. రఘువంశంలో ఆది విష్ణువును వర్ణించినా అదే అద్వైత భావం. అద్వైత భావమే ప్రతి ఫలించి కనిపిస్తుంది ప్రతి మాటలోనూ మనకు . రసాంతారా ణ్యేక రసం - యథాదివ్యం పయో శ్నుతే మేఘ మండలంలో నుంచి వచ్చిన జల మేక రూపమైనా నేలమీద పడేసరి కది స్థల భేదాన్ని బట్టి అనేక రూపాలుగా మారి కనిపస్తుంది. అలాగే ఏకరూపుడైన పరమాత్మే ఉపాధి భేదాన్ని బట్టి శివ కేశవాది రూపాలుగా జీవ జగదాది రూపాలుగా భాసిస్తున్నాడట. ఏకస్త్వం సర్వ రూప భాక్. సూత్ర ప్రాయంగా చాటిన ఒక్కమాటలో ఉపనిష దర్ద మంతా తొంగి చూస్తున్నది. ఏకం రూపం బహుధా యః కరోతి - రూపం రూపం ప్రతిరూపో బభూవ అనే ఉపనిషద్భావాలకూ వీటికీ తేడా ఏముంది. ఒక ఉపనిషత్తు అనే కాదు. ఉపనిషత్సా రమైనకాళిదాస ప్రత్యభిజ్ఞ ాది గ్రంధ తాత్పర్యం కూడా చోటు చేసుకొంటూ నే ఉంటుందాయన మాటలలో. అభ్యాస నిగృహీతేన మనసా అజస్య గృహ్లతో జన్మ త్వయ్యావేశిత చిత్తానాం త్వత్సమర్పిత కర్మణాం - అనవాప్త మవాప్తవ్యం నతేకించన విద్యతే - ఇలాటి వాక్యాలెన్నో గీతా వాక్యాలనే ప్రతిధ్వనిస్తుంటాయి.

  ఈ విధంగా శ్రుతి స్మృతి మార్గంలో అద్వైత విజ్ఞానాన్నే మనోగతం చేసుకొన్న కాళిదాసు దాని నమలు పరుచుకొని జీవిత లక్ష్యాన్ని సాధించటంలో ! మాత్రం సమాధి యోగ మనుసరిస్తాడు. అదే లోకానికి ప్రబోధిస్తాడు.

Page 21

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు