#


Index


స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

శాఖలలో దేనిలోనో ఒకదానిలో చేరిపోవలసిందే. తప్పదు. కాగా ఈ రెండూ కూడా మరలా ఒక్కటే సుమా అని ప్రబోధించటమే అద్వైతులు మ్రోగించే విజ్ఞాన భేరి. అది మరలా ఎంతగా బజాయించి చెబుతున్నాడో చూడండి మహాకవి.

  ఇలాగే రఘువంశంలో దేవతలు చేసిన స్తోత్రంలో కూడా ఇంకొక మారు బజాయించి చూపాడు మనం మరచి పోకుండా ఆ వేదాంత దుందుభినే. నమో విశ్వ సృజే - త్రేధా స్థితాత్మనే అంటూ, కుమార సంభవంలోని భావమే ఇక్కడా దర్శనమిస్తుంది మనకు. అయితే అక్కడ బ్రహ్మను గూర్చిన స్తోత్రమయితే ఇక్కడ విష్ణువును గూర్చి చేసిన స్తోత్ర పాఠం. బ్రహ్మేమిటి విష్ణువేమిటి రుద్రుదేమిటి. మహాకవికి ముగ్గురూ సమానమే. ఒకరెక్కువ ఒకరు తక్కువ అని చూచే వీర వైష్ణవుడో వీరశైవుడో కాడు కాళిదాసు. కాళిదాసనే పేరున్నందుకు శైవుడో శాక్తేయుడో కావలసిన వాడాయన. కాని అది వాచారంభణం వికారో నామధేయ మన్నట్టు కేవలం నామమాత్రమే. యధార్ధాని కాయన త్రిమూర్తులనూ అమూర్తమైన ఒకే ఒక తత్త్వంగా దర్శించిన మహానుభావుడు. అందుకే త్రేధా స్థితాత్మనే అని వర్ణిస్తున్నాడు. ఇంకా విశదంగా వర్ణించాడు కూడా వారి ముగ్గురికీ భేదం లేదని కుమార సంభవంలోనే మరొక చోట. శివ పార్వతుల వివాహ మహోత్సవం ఓషధీ ప్రస్థంలో జరుగుతూంది. అక్కడ ముక్కోటి దేవతలూ మహర్షులూ- వారందరికీ ఆరాధ్యులయిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులూ అందరూ కలుస్తారు. అప్పుడు క్రొత్తగా పెండ్లికొడుకైన ఈశ్వరుణ్ణి చూచి బ్రహ్మా విష్ణువూ జయ జయ ధ్వనులతో కీర్తించారని చెబుతూ ఇలా అంటాడు మహా కవి. ఏకైవ మూర్తి ర్బిభిదే త్రిధా సా - సామాన్య మేషాం ప్రథమావ రత్త్వం. ఒకే మూర్తి మూడు మూర్తులుగా భాసిస్తున్నది. అందులో ఒకటి హెచ్చు ఒకటి తగ్గని లేదు. హెచ్చు తగ్గులుంటే ముగ్గురికీ ఉన్నాయి. ఒకరికి వేడుక జరుగు తుంటే మిగతా ఇద్దరూ ఆయనకా

Page 20

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు