స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
తారకుని బాధలు పడలేక సత్యలోకానికి వెళ్ళి దేవతలు పరమేష్ఠిని గూర్చి చేసిన స్తోత్ర మొక్కటి చాలు ఆయన అద్వైత విజ్ఞాన పరిపాక రసజ్ఞతను చవిచూడటానికి. నమ స్త్రీ మూర్తయే తుభ్యం - ప్రాక్సష్టః కేవలాత్మనే. సృష్టికి పూర్వం కేవల మాత్మ స్వరూపుడేనట ఆ పరమాత్మ. శుద్ధమైన ఆ చైతన్యమే సత్త్వ రజస్తమో గుణాల మూలంగా విభక్తమై త్రిమూర్తులుగా భాసిస్తున్నదట. అప్పటికి సగుణ మనేది ఏదో గాదు. నిర్గుణమైన తత్త్వమే సగుణంగా కనిపిస్తున్నది. అమూర్తమైన దశలో నిర్గుణం. మూర్తమైన దశలో సగుణం. అంతే కాదు. జగద్యోనిః ఈ దృశ్యమానమైన జగత్తుకు కూడా యోని ఆ పరమాత్మే. యోని అనగానే కార్య కారణ భావాన్ని మరలా శంకించ రాదు. ఆత్మాన మాత్మనా వేత్సి సృజస్యాత్మాన మాత్మనా. తన్ను తానే సృష్టించు కొంటున్నాడట జగధ్రూపంగా. ఉపాదాన నిమిత్త కారణాలు రెండూ ఆ ఈశ్వరుడే. అంతమాత్రమే కాదు. త్వామామనంతి ప్రకృతిం - తదర్శిన ముదాసీనం - త్వామేవ పురుషం విదుః- పురుషార్థ ప్రవర్తిని అయిన ప్రకృతీ తన్నిమిత్తంగా భోగాప వర్గాలు అనుభవించే పురుషుడు కూడా ఆ పరమాత్మే నని పేర్కొంటారు. దీనిని బట్టి ఏమని అర్ధం చేసుకోవాలి మనం. జీవ జగదీశ్వరులని త్రివిధ రూపాలుగా కనపడే సృష్టి ఊరక ఒక ఆభాసే గాని వస్తు రూపంగా చూస్తే చివర కొకే ఒక ఆత్మ చైతన్యమే. పరిపూర్ణాద్వైత భావమిది. ఈ భావాన్నే మూట గట్టి ఒక్క మాటలో బయట పెట్టాడు మహా కవి చివరకు. త్వమేవ హవ్యం హోతాచ ధ్యాతా ధ్యేయంచ యత్పరం అని. హోతా హవ్యం - భోజ్యం భోక్తా - ధ్యాతా ధ్యేయం - ఇలా ద్వంద్వ రూపంగా భాసించే సృష్టి అంతా పరమాత్మే నట. నారాయణ పరో ధ్యాతా - ధ్యానం నారాయణః పరః అనే నారాయణ సూక్త మిందులో తొంగి చూస్తున్నది. సృష్టి నంతటినీ గాలిస్తే ఉన్నవి రెండే పదార్థాలు. ఒకటి విషయం. మరొకటి విషయి. ఆత్మానాత్మ లన్నా ఇవే. గ్రహించే దొకటైతే గ్రహణ గోచర మవుతున్న దొకటి. ఇంతకు తప్ప వేరొక పదార్థమే లేదు. ఏదైనా ఉంటే అది ఈ రెండు
Page 19