#


Index


స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  మరి పూర్వ మీమాంసలో ఎంత ప్రవేశమో ఉత్తర మీమాంస అయిన వేదాంత దర్శనంలో కూడా అంత ప్రవేశమే మహాకవి కని పేర్కొన్నాము. మీమాంసకులు వేద ప్రామాణ్యమే గాని ఈశ్వర సద్భావాన్ని అంగీకరించరు. ఒక విధంగా కర్మ జడులయిన నాస్తికులు వారు. నాస్తి పరలోకః అని కాకపోయినా నాస్తి ఈశ్వరః యేషాం అని అర్థం చెప్పవలసి ఉంటుంది వారి విషయంలో. ఈశ్వరుడే లేడు వారికి. శాస్త్రమే వారి సర్వస్వం. అది అపౌరుషేయం. ఏ పురుషుడూ నిర్మించింది కాదని వారి విశ్వాసం. మనబోటి అల్పజ్ఞుడైన పురుషుడు కాకపోయినా సర్వజ్ఞుడైన పరమ పురుషుడు నిర్మించాడని చెప్పటంలో ఆ క్షేపణ ఏముందని వేదాంతుల ప్రశ్న. తస్య నిశ్వ సితం వేదాః అన్నారు. తస్య నిశ్వసితం యదృగ్వేదో యజుర్వేద స్సామావేదో 2 ధర్వాంగిరసః అని వేదమే ఘోషిస్తున్నది. పరమాత్మ నిశ్వసితమే వేద చతుష్టయ ట . అంటే ఏమని అర్థం. పురుషుడు నిశ్వసించినట్టు అవలీలగా తన సంకల్ప బలం చేతనే ఋగాది వేద వాఙ్మయ మంతటినీ సృష్టించాడు సర్వజ్ఞుడైన ఈశ్వరుడు. లేకుంటే జడమైన ప్రపంచానికెలా అస్తిత్వం లేదో తత్ప్రతిరూపమైన వాఙ్మయ ప్రపంచానికీ లేదు. ఇది మీమాంసకులు గుర్తించక పోవటం శోచనీయం. కాళిదాసు మీమాంసాభిమాని అయినా ఆ అంధ కూపంలోనే పడిపోలేదు. అది జీవిత గమ్యాన్ని కొంత వరకే గాని చివర దాకా కొనిపో లేదని తెలుసు నాయనకు కనుకనే దానికి పూరక మైన వేదాంత దర్శనాన్ని అభ్యసించాడు. అందులోనూ ద్వైత విశిష్టాద్వైత భూమికలను కూడా దాటి పోయి సరాసరి అద్వైత రంగంలోనే ప్రవేశించాడు. దాని పరోక్షా పరోక్ష జ్ఞానాలను రెంటినీ ఆకళించు కొన్నాడు. అత్మా నాత్మలను రెంటినీ ఆత్మ స్వరూపంగా చూడటమే అద్వైత హృదయం. అది పూర్తిగా హృదయంగమం చేసుకొన్న వాడు కాళిదాసు. దాని సంస్కార మక్క డక్కడా తొంగి చూస్తూనే ఉంటుందాయన కావ్యాలలో.

Page 18

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు