స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
బాగా స్పష్ట మవుతుంది. రఘువంశంలో ఋష్యాశ్రమాలు అక్కడ జరిగే జపహోమాది క్రియలు ఎంతో శాస్త్రీయమైన సంప్రదాయంలో ఆరితేరిన శ్రోత్రియుడి లాగా వర్ణిస్తాడు కవి. శాకుంతలంలో ఋషివాటిక నెప్పుడు వర్ణించినా మనకా వాతావరణం కండ్లకు కట్టినట్టుగా కనిపిస్తుంది. వైదికమైన కర్మ కలాపం సాంప్రదాయికమయిన రీతిలో భాసింప జేస్తాడు. అగ్ని మోత్రాలు అగ్ని శరణాలు మహర్ష లతిధులై వచ్చినపుడు రాజులు వారినందులో ప్రవేశ పెట్టి అక్కడనే వారిని కలుసు కోవటం- మంత్రవిదులయిన మహర్షులు చేసే శాంతిక పౌష్టికాది క్రియలు- రాజ్యానికేవయినా అరిష్టాలు సంభవిస్తే వాటి నుచ్చాటనం చేసే విధానాలు- ఇలాటి కలాప మెక్కడ బడితే అక్కడ సాక్షాత్కరిస్తాయి. తపః ప్రభావం వల్ల వారికి లభించే అలౌకిక సిద్ధులను కూడా సందర్భోచితంగా వర్ణిస్తాడు కవి. కణ్వ మహర్షి కగ్ని హోత్రుడే శకుంతలా గర్భ వృత్తాంతాన్ని వెల్లడించటం ఆవిడను అత్త వారింటికి పంపేటపు డక్క డి వనదేవతలే ఆవిడకు కావలసిన నేపథ్యాన్ని ప్రసాదించటం ఇదంతా అలౌకికమే. పశు విశసనాదులు కూడా శాస్త్ర విహితం గనుక హేయం కాదనే కాళిదాసు నమ్మకం. పశుమారణ కర్మ దారుణో ప్యను కంపా మృదురేవ శ్రోత్రియః అంటాడు శాకుంతలంలో. ఒక మత్స్యప జీవి జీవికను రాజపురుషులు పరిహసించి నపుడది సమర్ధించుకొంటూ అతడాడిన మాట ఇది . యజ్ఞంలో పశువును శ్రపణం చేసినంత మాత్రాన శ్రోత్రియుని కఠినాత్ముడన వచ్చునా అలాగే నన్ను అన రాదంటాడు వాడు. అసలు బ్రహ్మ దేవుని దేవతలు స్త్రోత్రం చేసినపుడు వారి నోట అప్రయత్నంగా దొరలిన ఒక -మాట ఇది . ఉద్ఘాతః ప్రణవో యాసాం న్యాయై స్త్రిభి రుదీరణం - కర్మ యజ్ఞః ఫలం స్వర్గః తాసాంత్వం ప్రభవో గిరాం. ఓంకారంతో ఆరంభమయి ఉదాత్తాది స్వరభేదాలతో ఉచ్చారితమై యజ్ఞమే కర్మ స్వర్గమే ఫలంగా అవతరించిన వేద వాక్కులకు నీవే గదా జన్మ స్థానమని కీర్తిస్తారు వారు. మీమాంసా శాస్త్ర సారమంతా మూట గట్టి చెప్పిన మాట ఇది.
Page 17