#


Index


స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

మనకు ద్యోతిత మవుతూనే ఉంటుంది. రఘుమహారాజు నిర్యాణాన్ని వర్ణించటంలో ఆయనకున్న యోగ శాస్త్రాభి నివేశం ప్రకాశిత మవుతుంది. పరమేశ్వరుని తపశ్చర్యను వర్ణించటంలో కూడా అది మనకు విశద మవుతుంది. అష్టాంగ యోగమూ తత్తద్విభూతి ప్రాప్తి - ఇలాటి యోగ రహస్యాలన్నీ సందర్భోచితంగా సూచిస్తూనే పోతాడు కవి. యోగేనాంతే తనుత్యజామని రఘువంశ రాజుల అవసాన దశను వర్ణించటంలో ధారణా ధ్యాన సమాధుల ద్వారా ప్రాణోత్రమణ చెందటమే ముక్తి దాయకమని తన నమ్మకాన్ని చాటు తున్నాడు కూడా.

  పోతే ఇవన్నీ ఒక ఎత్తు. ఆయన గారి మీమాంసా పరిజ్ఞాన మొక ఎత్తు. మీమాంస అనేదొకటి గాదు. రెండు. పూర్వ మీమాంస. ఉత్తర మీమాంస. మాతుమిచ్ఛా మీమాంసా. వేదానికర్థం ఫలానా అని నిర్ణయించటానికే మీమాంస అని పేరు. అది కొందరు కర్మ అంటే మరి కొందరు బ్రహ్మ మన్నారు. మొదటి వారు పూర్వ మీమాంసకులు. రెండవ వారు ఉత్తర-మీమాంసకులు. అసలు పూర్వ మీమాంసకులకే మీమాంసకులనే పేరు రూఢమయింది. కాగా ఉత్తర మీమాంసకులను మీమాంసకులని గాక వేదాంతులనే పేరుతో వ్యవహరిస్తారు. వేదం చెప్పిన కర్మ కలాప మంతా బ్రహ్మ జ్ఞానం లోనే పర్యవసిస్తుంది అదే వేద తాత్పర్యమని చెబుతారు కాబట్టి వీరు వేదాంతు లయ్యారు. అది ఒప్పుకోరు మీమాంసకులు. వారికి బ్రహ్మ మనేది లేదు. బ్రహ్మం లేకుంటే బ్రహ్మ జ్ఞాన మసలే లేదు. వారు గడించాలని చెప్పే జ్ఞాన మేక్కటే. అది విధి నిషేధ రూపమైన కర్మ జ్ఞానం. జ్ఞాన మాత్రమే గాక తదనుష్ఠానం కూడా. అదే ఫలకారి వారి దృష్టిలో. ఇదుగో ఈ ద్వివిధమైన జ్ఞానమూ ఎంత పుష్కలంగా ఉండాలో అంతగా ఉంది కాళిదాసుకు. కర్మజ్ఞానంలోనూ బ్రహ్మజ్ఞానంలో నూ నిష్ణాతుడాయన. ఈ ద్వివిధ శాఖలను గూర్చి ఆయన అక్కడక్కడ ప్రస్తావ వశంగా చేసిన పరామర్శల లోనే మనకు

Page 16

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు