సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
గమ్యశ్చ సముద్రంలాగా గంభీరుడూ ఆ కర్షణీయుడూ కూడా. దండ పారుష్యం లేదా పాలనలో. దండ శైధిల్యమూ లేదు. నాతి శ్రమాప నయనాయ నచ శ్రమాయ. శ్రమ ఉందా లేదా పాలనలో. ఉందీ లేదు. ఒక ఛత్రం పట్టుకొని ఎండలో నడుస్తున్నట్టే. పట్టుకొనే కష్టమూ ఉంది. ఎండ తగల లేదనే సుఖమూ ఉంది. కేవల సుఖం కేవల దుఃఖం సృష్టిలోనే లేదు. రెండూ అగ్రాలే. అగ్రాలలో శాంతి లేదు. రెండింటి మధ్యనున్న మార్గంలోనే ఉంది సామరస్యం. చూడండి ఈ శ్లోకంలో కాళిదాసు బయటపడి ఎలా చాటుతున్నాడో ఈ సమన్వయ రహస్యాన్ని. అజ మహారాజు రాజనీతి చాతుర్యాన్ని వర్ణిస్తూ ఇలా అంటా డొక మాట. న ఖరో నచ భూయసా మృదు :- పవమానః పృధివీ రుహా నివ స పురస్కృత మధ్యమ క్రమో -న మయా మాస రిపూ ననుద్దరన్. ఒక మారుతం లాగా ఉండాలట దేశమేలే రాజు వ్యవహారం. గాలి బ్రహ్మాండంగా వీస్తే చెట్లు పెళ్ళగిలి పడిపోతాయి. అలాగని అసలే వీచకపోతే అవి తలలు పైకెత్తి దాన్ని వెక్కిరిస్తాయి. వీచాలి -వాటిని క్రిందికి వంచాలి. అంతేగాని పడగొట్ట కూడదు. ఇదీ ఉపమానం. ఇక దీన్ని అన్వయిస్తున్నాడా రాజు ప్రవర్తనకు. ఆ రాజు కూడా శత్రు రాజుల మీదికి దండెత్తి పోయి వారిని వంచే వాడే గాని త్రుంచే వాడు కాడట. అలాటి మార్గ మాయనది. మధ్యమ మార్గం via media దీన్నే పూర్వం యవనులు Golden Mean అని పేరు పెట్టి వర్ణించారు Mean అంటే మధ్యమ మార్గమనే అర్థం. అది Golden బంగారం లాంటిది. ఏ కొస పట్టుకొన్నా సుఖం లేదు. తనకూ లేదు ఇతరులకూ లేదు. ఉభయ తారక మైనది మధ్యమ క్రమమే ఎప్పుడూ. ఎందుకని. ఉభయ లక్షణాలూ దానిలో ఉన్నాయి గనుక.
ఇలాంటి మధ్యే మార్గంలో పయనించే కవి దృష్టికీ సృష్టి అంతా ఇక బంగారమే. ఇది రమ్య మిది జుగుప్సిత మిది నీచ మిది ఉదారమనే వైషమ్యం లేదు. వైరుధ్యం లేదు. ఏదీ గుణం కాదు ఏదీ దోషం కాదు. దోషమే గుణం కావచ్చు. గుణమే దోషం కావచ్చు. దేని స్థానంలో ఏది ఉంటే అది గుణం. స్థానం తప్పి ఉంటే అది దోషం. అన్ని గుణాలూ ఒక చోట పెట్టి సృష్టించలేదే
Page 212