సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
పోతే హిమవంతు డెవరు. అది ఒక పర్వతం. భూతలం మీద మన అందరికీ దర్శన మిస్తున్నదది. అది దేవతలతో సంబంధం పెట్టుకొన్నది. దానికి జన్మించిం దెవరో కాదు. సాక్షాత్తూ ఆ పరాశక్తే. ఆ పర్వతం ప్రక్కనే ఉంది కైలాసం. దాని అధినేత ఈశ్వరుడు వచ్చి ఎక్కడో కాదు ఆ హిమవంతం మీదనే కూచుని తపస్సు చేస్తున్నాడు. అక్కడే కామ దహనం. అక్కడే అమ్మవారి తపశ్చర్య. అక్కడ వారి కళ్యాణం. దాని కన్ని ఊర్ధ్వ లోకాల నుంచీ బంధు మిత్ర పరివారమంతా తరలి రావటం. బ్రహ్మ వచ్చాడు. విష్ణువు వచ్చాడు. అందరూ వచ్చి ఆ పర్వతం మీదనే సమావేశ మయ్యారు. చివరకు శివ పార్వతుల చంద్రికా విహారం గూడా అక్కడే. ఇది దివ్యమా భౌమమా ఈ సన్నివేశం. కాళిదాసు నడిగితే అంటాడు. ఇత్యభౌమ మనుభూయ శంకర:- పార్ధివం చ దయితా సఖస్సుఖం. భౌమమేమిటి. దివ్యమేమిటి. రెండూ అనుభవించారట ఆ దంపతులు. అత్తవారింట్లో ఉండి కొంతా అక్కడక్కడా తిరుగుతూ కొంతా. మరి మేఘ సందేశంలో చూస్తే యక్షుడెక్కడి వాడు. అలకా నగర నివాసి. అది గుహ్యక లోకం. మనది కాదు. కాని శాప గ్రస్తుడయి అతడు వచ్చి కూచున్న దెక్కడ. రామ గిరి -చిత్రకూటాశ్రమం. పట్టుకొన్న దేవణ్ణి. మేఘుణ్ణి. వర్ణించిన మార్గమేది. పూర్వమేఘంలో మన ఈ భూమండలంలో చూచే వన నదీ పట్టణ పర్వతాదులూ - ఉత్తర మేఘంలో అతిలోకమైన యక్షలోక వృత్తాంతమూ.. ఏమిటి దంతా. ఏదో కాదు. కాళి దాస మహాకవి సమన్వయ దృష్టి, స్వర్గంలో భూమినీ భూమిలో స్వర్గాన్నీ చూస్తున్నదది. అది ఉచ్చ మిది నీచ మనే తేడా లేదా చూపుకు. అంతా త్రిపుర సుందరీ సౌందర్య విభూతే. సర్వత్రా చెదరి పడిన ఆ విభూతి శకలాలే ఒకటి స్వర్గమైతే ఒకటి భూతలమయింది. ఒకటి భూతల మైతే మరొకటి పాతాళ మయింది. పాతాళ వాసులైన రాక్షసులు స్వర్గం మీద విరుచుకు పడితే మధ్యమ లోక వాసులైన మహా రాజుల నూర్ధ్వ లోక వాసి దేవేంద్రు డర్దిస్తే అక్కడికి వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళను మట్టు పెట్టి స్వర్గ వాసుల అభినందనకు పాత్రులు కావటమా. త్రిలోకాలనూ
Page 209