సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మృగాల వేటగదా అది. ‘మృగాలంటే అనేక ముంటాయి అడవిలో. అనేక స్వభావా లుంటాయి వాటికి. వాటి స్వభావాన్ని బట్టి వాటిననేక విధాలుగా వేటాడాలి రాజుగారు. అలాగే ఆడుతూ వచ్చాడు. ఆ వేటాడే వైవిధ్యాన్ని కళ్ళకు కట్టినట్టు చూపాలంటే ఛందో బంధంలో కూడా వైచిత్రాన్ని చూపాలి కదా. అందుకే యాభైనాలుగు శ్లోకాల వరకూ ద్రుత విలంబితంలో ఊగుతూ జోగుతూ నడచిన రచన హరిణ మృగా లెదురయ్యే సరికి వసంత తిలకగా మారింది. వరాహాలనూ ఖడ్గ మృగాలనూ కూడా కలుపుకొంది. వ్యాఘ్రాల దగ్గర అది భీకర రూపంలో గ్రీష్మ తిలకగా సాగింది. ఏదో తాడో పేడో తేల్చు కొందామని శాలినీ వృత్తంతో చేతులు కలిపింది. వచ్చిందా తరువాత ఒక మదగజ యూథం. మదేభం గదా మంద గంభీరంగా నడవాలి మరి వృత్తం. తాన్ హత్వా గజ కుల బద్ద తీవ్ర వైరాన్ అంటూ నడవ సాగింది. దాన్నీ దెబ్బ తీసి వెడుతుండగా చమరీ మృగా లెదురయ్యాయి. చెంగు చెంగున గంతు లేస్తున్నాయవి. ఎలా పట్టుకోవాలి. అందుకే గుఱ్ఱాన్ని కూడా గంతు లేయించింది వృత్తం. చమరాన్ పరితః ప్రవర్తితాశ్వః. బాణం లాగే టపుడు మాత్రం సాగదీసింది మళ్ళీ. క్వచిదా కర్ణ వికృష్ణ భల్ల వర్ష. మరి నెమళ్ళు కంట బడ్డాయి. బెదరి ఆకాశంలోకి ఎగిరి పురులు విచ్చి కనిపించాయి. పురివిప్పిన పద్యమే మాలిని గుర్తుకు వచ్చింది మహా కవికి. అపి తురగ సమీపా దుత్వతంతం మయూరం. వెంటనే శ్రమ అని పించింది. చెమట పట్టింది దశరథుడికి. అందుకే రథోద్ధత. ఆ వెంటనే సలలిత కుసుమ అంటూ పుష్పితా గ్ర. ఆ వెనుకనే జరుగబోతున్న దొక ఉపద్రవం. అందుకే వియోగిని తారసిల్లింది. బాణం స్వాగతం చెప్పింది ముని బాలుడికి తరువాత స్వాగత వృత్తంలో. బాణం ప్రాణం తీసింది. అందుకే మరలా వియోగిని. హా తాతేతి ఆక్రందించాడు మత్త మయూరంలో. జరిగినదానికి వగచి జంకుతూ కొంకుతూ నెమ్మదిగా బయలు దేరాడు దశరథుడు. అంత నెమ్మదిగానే అతని వెంట నడచింది వసంత తిలక. కాళిదాసుని ఇలాటి కళా సౌరభా లన్నిటినీ గమనించే బహుశా తిక్కన సోమయాజి స్త్రీ పర్వంలో స్త్రీల
Page 189