సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
దీనాలాప వైచిత్రిని చూపటానికి ఇలాగే ఛందో వైచిత్రిని పాటించాడా అని పిస్తుంది. మొత్తానికి ఒక చ్ఛందస్సే మిటి వాక్య నిర్మాణ మేమిటి పద విన్యాస మేమిటి . ఇది అది అనే ప్రశ్న లేదు. తృణం మొదలు దేవతార్చన వరకు ఏదీ ఊరక పోనివ్వడు కాళిదాసు. అటు భావంలో గాని ఇటు భాషలో గాని ఏ ఒక్క కోణాన్ని చూచినా సౌందర్య ధుర్యమైన దృక్కోణంతోనే చూచాడు. ఏది వర్ణించినా ఆ దృష్టితోనే వర్ణించాడు. అంతా రామ మయం అన్నట్టు కావ్య ప్రపంచమంతా సౌందర్యమయమే ఆ మహా కవికి.
Page 190