#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

అందులో కూడా సిద్ధ హస్తుడే కాళిదాసు. దిలీపుడు నందినీ ధేనువును సేవించిన ఘట్టంలో ఆ గోవును ఏడెనిమిది చోట్ల చెప్ప వలసి వచ్చింది. వస్తేఒక చోట ధేనువని ఒక చోట గోవని ఒక చోట గృష్టి అని మరొక చోట పయస్విని అని ఇంకొక చోట సౌరభేయి కుండోధ్ని ఘటోధ్ని అని మాటి మాటికీ మారుస్తూ పోతాడు. సీతా దేవి మీద లోకు లపవాదం వేస్తే అది మహాకవి కలంలో అపవాద పరివాద కళంక వాచ్య అవర్ణ కౌలీన నిర్వాద-ఇన్ని రూపాలలో అవతరిస్తుంది. చెప్ప వచ్చిందేమంటే అలా పర్యాయాలు వాడటంలో కొన్ని కొన్ని రూపాలు ఎక్కడో కోశ గ్రంధాల నుంచి అపురూపంగా పట్టుకు వచ్చినవి కూడా అయి ఉంటాయి. దీన్ని బట్టి కవి నిఘంటు జ్ఞానం కూడా మనకు తేట పడుతుంది. పదాలూ పర్యాయ పదాలూ- వీటి మాట అలా ఉంచి అసలు పద బంధాలని ఒక జాతి ఉంది రచనలో. అవి మహా కవుల రచనలో గాని మనకు దర్శన మీయవు. పదాల నెవరూ సృష్టించరు. అన్నీ భాషలో సిద్ధమైనవే. కాని వాటినే రక రకాలుగా మేళవించి ప్రయోగిస్తే సరికొత్త పదాలుగా భాసిస్తాయి. రత్న శలాకల లాగా ఏవో క్రొత్త క్రొత్త మెరుగులు చిమ్ముతాయి. ఈ విద్యలో ఆరి తేరిన ముక్కాకలు తీరిన కళాకారుడు కాళిదాసు. పానకంలో మిరియం లాగా లడ్డులో పచ్చ కర్పూరంలాగా హల్వాలో జీడి పప్పులాగా- అప్పుడప్పుడూ రసజ్ఞుల జిహ్వకు సోకుతూ అనిర్వచనీయమైన ఒక అనుభూతిని అసలు అర్దంకన్నా ముందుగా శబ్దమే ప్రసాదిస్తుంటుంది. దీని కెన్నైనా చూపవచ్చు ఉదాహరణలు. మణులూ మాణిక్యాల లాగా విలువైన పద బంధాలు కొన్ని వందలున్నాయి కాళిదాసులో. అందులో కొన్ని నా చేతికి వచ్చినవి మీ చేతి కందిస్తాను ఆనందించండి. విరహ గురుణా- పుణ్యోదకేషు - చంద్రికా దౌత - శ్రోత్ర పేయం - మయూఖ ప్రరోహ పరిమళో ద్గారి - సూచి భేద్య - ముక్త మార్గ - మిత కథే భక్తి నమ్ర - అర్చిస్తుంగాః ప్రదీపాః -రుదితో చ్చూన నేత్ర - దృష్టి రాలుప్యతే సొంతవాసం పయోధర విస్తారయితృ- ఉన్మాద యితృయౌవనం స్పర్శ క్షమా పరిణత చంద్రికా

Page 179

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు