#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

రెండు. ఒకటి రఘు చక్రవర్తి దండయాత్ర. మరొకటి శ్రీరాముని చరిత్ర. ఇందులో దండయాత్ర నాలుగవ సర్గలో వస్తుంది. ఈ సర్గతోనే ప్రారంభిస్తా రసలు రఘువంశ పాఠం విద్యార్థులకు. దీని కేమిటా హేతువని చాలా రోజు లాలోచించే వాణ్ణి నేను. లోతుకు దిగి పరామర్శిస్తే నాకై నాకే స్ఫురించింది. కొంత కాలాని కందులో సబబు. వ్యాకరణా లంకార శాస్త్ర సామగ్రి అంతా చాలా వర కొక్క చోటనే పోగు చేసుకోగల పెద్ద రత్నా పణమది. అందుకే అలాటి జ్ఞానం శిష్యుల కందివ్వటాని కవకాశ ముంటుందని ఈ చతుర్థ సర్గతోనే ప్రారంభించేవారు మన ప్రాచీనులు అప్పటి నుంచే స రాజ్యం గురుణా దత్తమనే శ్లోకమే రఘువంశ ప్రారంభ శ్లోకంగా చలామణిలోకి వచ్చింది. బహుశా రఘువంశమని కావ్యానికి పేరు పెట్టినందుకు రఘు మహారాజు ఉదంతంతోనే శ్రీకారం చుడదామని పించిందేమో వారికి. సరే అవన్నీ అలా ఉంచండి. అది కాదు నేనిప్పుడు చెప్పదలచిన విషయం. ఈ నాలుగవ సర్గలో వర్ణించిన రఘు చక్రవర్తి దిగ్విజయ వృత్తాంతం. అందులో వరుసగా దిగ్విజయ మెలా సాగిందో దానితో వర్ణనా అలాగే సాగింది. రెండూ జోడు గుఱ్ఱాలలాగా ఒకే రచనా శకటాన్ని లాగుతూ ముందుకు పోతాయి. ఇదీ మనం చూడ వలసిన విశేషం. ప్రససాదోదయా దంభః కుంభయోనే ర్మహౌజసః - రఘోః పరిభవా శంకి చుక్షుభే ద్విషతాం మనః. శరత్కాలం రాజులకు యాత్రా కాలం. అప్పుడు అగస్త్య నక్షత్ర ముదయించి నదులూ తటాకాలూ నిర్మల మవుతాయి. అవి నిర్మల మవుతుంటే శత్రురాజుల హృదయాలు భయంతో కలుషిత మవుతున్నాయట. సాక్షాత్తూ శరద్దేవతే సరితః కుర్వతీ గాధాః .... యాత్రాయై చోదయామాస. నదీ జలాలు దాటటాని కనువుగానూ మార్గాల నాశ్యాన కర్దమంగానూ మార్చి యాత్ర చేయమని పురికొల్పు తున్నదట. ప్రదక్షిణార్చులనే చేతులు చాచి అగ్ని హోత్రుడు నీకే జయమని పలుకు తున్నాడట. తూర్పు దిశగా బలోపేతుడై పయనిస్తుంటే గాలికి కదిలే కేతువులే శత్రువులను చేతులు పైకెత్తి బెదిరిస్తున్నాయట. అక్కడక్కడ ఫలరహితులనూ ఉత్బాతులనూ

Page 154

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు