సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
ఇంతకూ సౌందర్యమూ ఔచిత్యమూ. కవి అయిన వాడి కివి రెండూ రెండు మార్గ దర్శులు. వీటి చేయి పట్టుకొని మార్గంలో నడిస్తేనే గమ్యం చేరుతాడు. మనలను చేరుస్తాడు. లేకుంటే అంతా అగమ్యమే. ఇలాటి అగమ్యమైన ప్రయాణమే సాగించారు నూటికి తొంబది మంది కవులు వాఙ్మయంలో. అందుకే నేమో ద్విత్రాః పంచషా వా అని వాపోయాడు ఆనందవర్ధనుడు. అంత పెద్ద రామాయణం వ్రాశాడు వాల్మీకి. భారతం వ్రాశాడు బాదరాయణుడు. ఎక్కడా ఔచిత్య రేఖ దాటలేదు. కథకు నిరోధకమైన వర్ణనే లేదు. ఇంకా అవి ఇతిహాసాలు కాబట్టి- ప్రక్షిప్తా లనేక మున్నవి కాబట్టి కొంతకు కొంత అధికారముంది వారి కవధులు తప్పటానికి. కాళిదాసు లాంటి కావ్య కర్తల కంటారో. అలాంటి దేమాత్రమూ లేదు. కారణ మేమంటే ఇది ఇతిహాసైక దేశమైన కథా వస్తువు. అసలే స్వల్పమైనది. అందులోనూ ఒక ప్రయోజన మేదో ఆసించి దాని కభిముఖంగా తీసుకెళ్ళాలి మనలను మహాకవి. ఈ ప్రయాణంలో ఏ ప్రక్క దారి తొక్కినా అది వెంటనే ఒక విలంబమూ విసుగూ కలిగిస్తుంది పాఠకుడికి. అంత మాత్రమే కాదు. తానా సించిన కావ్యార్థం బాగా మనసులో హత్తుకోదు. సవ సవగా జారిపోతుంది. ముందు పేర్కొన్నట్టు చాలా మంది కవులీ సూత్రాన్ని విస్మరించిన వారే. మాఘభారవి ప్రభృతులంతా ఇలాటి విశృంఖల వర్తనులే. అది ఇంతకు ముందే నేను సూచించి ఉన్నాను.
పోతే దీని కపవాదమైన రచన ఒక్క కాళిదాస మహాకవిదే. కథ లేని రచనా చేశాడు. కొంత ఉన్న రచనా చేశాడు. ముమ్మరంగా ఉన్నదీ చేశాడు. అందులో కావ్యాలూ రచించాడు. నాటకాలూ నిర్మించాడు. ఇలాటి రచన చేస్తున్నపు డెక్కడ దేని కనుగుణంగా ఏ మాత్రం చేయాలో ఆ మాత్రమే వర్ణన. అంతకు తక్కువ గాని ఎక్కువ గాని చేసిన వాడు కాడు. పోనీ చేతగాని వాడదామా. ఎంతో చేత నయినట్టు కనిపించే మిగతా కవులకన్నా వంద రెట్లు. చేత నయినవాడే. ఎంతో అందంగా అద్భుతంగా అవిస్మరణీయంగా
Page 147