#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

రహస్యాన్ని అర్థం చేసుకొని చక్కగా అమలు పరిచిన వాడే మహాకవి. కథకు దూరంగా సంబంధం లేకుండా చేయరాదే ప్రకృతి వర్ణనా. కథతో అవినా భూతమై ఏకమై పోవాలి. అప్పుడే కథా గమనానికది అడ్డుతగల కుండా పోయేది. అలాగే సాగాయి కాళిదాసు ప్రకృతి వర్ణనలన్నీ. ఎంతో అంతగానే సాగాయి. మేఘసందేశం కావ్యం కావ్యమంతా ప్రకృతి వివిధ దృశ్యాలు వర్ణించటమే. కొండలే గాదు. నదులే గాదు. పట్టణాలే గాదు. భవనాలే గాదు. ఉద్యాన వనాలే గాదు. ఋతువులేగాదు. దేశ కాలాలనే నేపథ్యం మీద పరచి చూపాడు ప్రతి ఒక్క చిత్రమూ కవి. అసలు కథ ఏముంది ఆ కావ్యంలో. ఒక యక్షుడు శాప గ్రస్తుడై చిత్రకూటం చేరటమూ దూరంగా అలకాపురిలో ఉన్న తన ప్రేయసి వియోగం భరించలేక ఒక మేఘుణ్ణి పట్టుకొని సందేశం పంపాలని ప్రయత్నించటమూ. ఇంతకూ ఇతడు పంపింది లేదూ. అతడు పోయి అందించింది లేదూ. అంతా యక్షుడి స్వగతమే. ఆ స్వగతంలోనే నడుస్తూ పోతుందీ వ్యవహారమంతా. ప్రకృతిని వర్ణిస్తూనే ఉంటాడొక ప్రక్క. మరో ప్రక్క దానితోపాటు అతని గత జీవితమూ- వర్తమానమూ దాని తరువాత రాబోయే వృత్తాంతమూ - కథా సన్నివేశాలుగా కలుపుకొంటూ వస్తాడు. హిత్వా తస్మిన్ భుజగవలయం. దారిలో కైలాసం వస్తుంది. అక్కడ పార్వతి పరమేశ్వరుడి చేయి పట్టుకొని శిఖరం మీది కెక్కుతుంటుంది. నీవు ముందుగా పోయి సోపాన పంక్తిగా మారి వారికి సేవ చేయమంటాడు మేఘుణ్ణి. హిత్వా హాలాం. మరి కొంత దూరం పోతే సరస్వతీ నది వస్తుంది. దాని జలాన్ని ఆస్వాదించు. పైకి నీ శరీరం మలినమైనా లోపల నిర్మలమైన భావ మేర్పడు తుంది నీకు ఇంతకు ముందు బలరాముడు తీర్థాటనం చేస్తూ అలా సేవించిన వాడే అంటాడు. ఇంకా దూరంపోతే ఉజ్జయిని వస్తుంది. అది నీ మార్గానికి కొంచెం దూరమైనా వెళ్ళి చూడు. చాలా బాగుంటుం దంటాడు. మరి ఇదంతా గడచి పోతే గాని అలకా పట్టణం రాదు. అదే నీకు గమ్య స్థానం. మా స్వస్థానం కూడా అదే. అక్కడే ఉంది మా గృహం. ఎలాంటిదో తెలుసా దాని సౌష్ఠవమని అదంతా ఏకరువు పెడతాడు. ఆ

Page 143

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు