స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
చూచుకొంటారు. అలాగని లోభులు కారువారు. ఎంత శబ్ద సంపద ఉన్నా దాని నెప్పు డెంతవరకెలా వాడుకోవాలో తెలుసు వారికి. దగ్గర ఉంది గదా అని దుర్వ్యయం చేయరు. అలా పొదుపుగా వాడినప్పుడే దానికి విలువ పెరుగుతుంది. అందమిస్తుంది. ఇలాటి శబ్ద ప్రయోగ కళా విశారదుడు కాళిదాసు. తరువాత వచ్చిన భారవి మాఘ నైషధ కర్తల లాగా ఎతుబారి కాడు. అవసరమున్నా లేకున్నా తమకున్న శబ్ద సంపద నత్యధికంగా విచ్చల విడిగా ఖర్చు పెట్టారు వారు. ఒక మధురమైన పదార్థమొక మోతాదులో తింటే బాగుంటుంది గాని మోతాదు మించి తింటే ఏమవుతుంది. మొగం మొత్తు తుంది. అలాగే మొత్తుతుంది వారి కావ్యాలు చదువుతుంటే సహృదయులకు. ఒక్క కాళిదాసు రచనల లోనే అలాటి ఉద్వేజన కలగనిది. లాక్షణికమైన పద ప్రయోగం చేయలేని వాడు కాడాయన. ఎంత ప్రౌఢమైన శబ్దమైనా ప్రయోగించ గలడు. శబ్ద శాస్త్ర పారంగతుడు. ఎంత పారంగతు డంటే శాస్త్ర పరిభాషను చివరకు కావ్య పరిభాషగా కూడా మార్చి చూపగలవాడు. వాలిని వధించి అతని స్థానంలో సుగ్రీవుడి కభిషేకం చేశాడు శ్రీరాముడు. అది ఎలా ఉందంటే ధాతోః స్థాన ఇవాదేశ మని పేర్కొంటాడు మహాకవి. ధాతువు స్థానంలో ఆదేశం లాగా ఉందట. దృశ్ అనే ధాతువుందంటే దానికి పశ్య అనే రూపం ఆదేశంగా వస్తుంది భాషలో. అంటే ఆ ముందున్న రూపాన్ని తొలగించి దానికి మారుగా ఇది చోటు చేసుకొంటుంది. అది ఇక కనపడదు మన కంటికి. అలాగే వాలి కనపడకుండా పోయి సుగ్రీవుడే ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. కావ్య భాషలో చెబితే చూడండి ఈ వ్యాకరణ పరిభాష ' ఎంత మనోహరంగా ఉందో. అలాగే దేవతల నందరినీ తారకాసురుడి సైనికులు స్వర్గం నుంచి తరిమి కొడితే అది ఎలా ఉందో కవి వర్ణిస్తున్నాడు. అపవాదై రివోత్సర్గాః కృత వ్యావృత్తయః పరైః . వ్యాకరణంలో ఉత్సర్గ సూత్రాలని అపవాద సూత్రాలని రెండు రకాలున్నాయి. ఒకటి సర్వ సామాన్యంగా వర్తించ వలసి ఉంటే అది ఉత్సర్గం. అలా వర్తించకుండా దాని నడ్డుకొనేది అపవాదం.
Page 14