#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ముముక్షుః ప్రాయోపవేశన మతి ర్మృపతి ర్బభూవ . దీర్ఘ వ్యాధితో డొల్ల అయిన శరీరాన్ని స్వయంగానే వదిలేయా లనుకొన్నాడట అజ మహారాజు. ఎక్కడ ఆ వదిలేయా లనుకొన్నది. తీర్దే తోయ వ్యతికర భవే జహ్ను కన్యా సరయ్వో: గంగా సాగర సంగమంలో. నదీ సంగమ మొక పవిత్రమైన తీర్థం. అందులో వదిలేస్తే ఆత్మ హత్యా దోషం లేదు. లేకుంటే మహా పాతక మది. ఇది ఒక ధర్మ సూక్ష్మం. ధర్మ శాస్త్ర జ్ఞాన మెంత ఉన్నవాడో చూడండి కవి. ఇలాటి ధర్మ సూక్ష్మ మొకటి ఉండటం వల్లనే అలా వర్ణించా డా రాజు అస్తమయం. కాకపోతే యోగేనాంతే తనుత్యజాం. యోగంతో శరీరాన్ని విడిచి పెట్ట వలసిన ఇక్ష్వాకు రాజులు రోగంతో విడిచారని చెబితే ఏమి మర్యాద. విడిచిన ఆ రాజుకూ లేదు చెప్పిన ఈ కవికీ లేదు. ఇక సంగీత శాస్త్రం సంగతి చెప్పబని లేదు. నిష్ణాతుడందులో. ఎంత నిష్ణాతుడు కాకుంటే యఃపూరయన్ కీచక రంధ్ర భాగాన్ - తాన ప్రదాయిత్వ మివోప గంతుం అని వర్ణించగలడా కుమార సంభవంలో. తానానికి సాధనంగా వేణువును తీసుకోట మేమిటి. ఈనాడే సంగీత విద్వాంసుడినైనా అడిగి చూడండి. వీణ తప్ప తానం చక్కగా పలికే జంత్రం మరొకటి లేదు అదే ప్రమాణం తానానికని చెపుతాడు. కాని కాళిదాసు వంశవాద్యమే ప్రమాణ మయినట్టు వర్ణించాడు. మహా మహోపాధ్యాయుడు మల్లినాధుడు వ్యాఖ్యానిస్తూ నిజమే వంశమాత్ర సాధ్యం తానమంటే నని శాస్త్ర ప్రమాణం కూడా చూపి సమర్థిస్తాడు. ఎంత లోతైన పరిజ్ఞానమో చూడండి మరి . తర్క వ్యాకరణాలిక ఎక్కడ బడితే అక్కడే పలుకు తాయి. విలక్షణమైన శబ్ద ప్రయోగం వ్యాకరణ జ్ఞతను సూచిస్తే ఆయా సందర్భాలలో వచ్చే పాత్రల సంభాషణ లాయన తర్క ప్రావీణ్యాని కద్దం పడతాయి.

  ఒక్క సూక్ష్మ మిక్కడ మనం సహృదయులుగా గుర్తుంచుకో వలసి ఉంది. ధనవంతులలో లాగానే కవులలో కొందరు పొదుపరు లుంటారు. కొంద రెతుబారు లుంటారు. పొదుపరుల సంఖ్యే తక్కువ. ఎంత చొరవ ఉన్నా శబ్దాన్ని వారెలాగంటే అలా ఖర్చు చేయరు. శబ్ద రాశిని ధనరాశి లాగా

Page 13

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు