స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మనం చూడవలసింది. అలాటి సమన్వయం చేసుకొన్న మహా కవి ఎవడైనా ఉన్నాడంటే అతడు కాళిదాసే. రమ్యాణి వీక్ష్య మధురాంశ్చ నిశమ్య శబ్దాన్ అనే శ్లోకంలో నామ రూపాలకు లేదా శబ్దార్ధాలకుండే ఈ సామరస్యాన్నే సూచించాడు కవి ఇందులో మొదటిది శ్రవణేంద్రియ గోచర మయితే రెండవది నయనేంద్రియ గోచరం. దీనిని బట్టే శ్రవ్య దృశ్య విభాగమేర్పడింది కావ్య ప్రపంచంలో. కాళిదాసందుకే మూడు కావ్యాలూ మూడు నాటకాలూ రచించి తాను ప్రతిపాదించిన సూత్రాన్ని సోదాహరణంగా నిరూపించాడు. ఇది నేను దీని తరువాత వచ్చే రచనా ప్రత్యభిజ్ఞలో విపులంగా చర్చిస్తాను. అలమిహైతావతా వాక్సందర్భేణేతి విరతోస్మి.
పోతే ఇది కళా ప్రపంచ మయితే ఇక శాస్త్ర ప్రపంచంలో కాళిదాసెంత సిద్ధ హస్తుడో అత డక్కడక్కడా విసిరే మాటలను బట్టే తెలుసు కోవచ్చు. వేద వేదాంగాలే గాదు. పురాణేతిహాసాలే గాదు. ధర్మ శాస్త్రాది స్మృతి గ్రంధాలే గాదు. తర్క వ్యాకరణాదులే గాదు. షడ్దర్శనాలేగాదు. అంతవరకు ప్రచలితమై ఉన్న రామాయణ భారత భాస సౌమిల్లకాదుల సాహిత్య గ్రంధాలే గాదు. ఇంకా ఆయా తంత్రాగమాది రహస్యాలే గాదు. భారతీయ విజ్ఞాన క్షేత్ర మంతా గాలించిన పెద్దమనిషి ఆయన. ఎంతగా వాటిని జీర్ణించు కొన్నాడో వాటి సంస్కార ముద్గర రూపంగా ఆయన రచనలలో వినిపిస్తూనే ఉంటుంది. అరుంతుద మివాలానం - అనిర్వాణస్య దంతినః అంటాడు. నిర్వాణమంటే గజ స్నానానికి సాంకేతిక పదం. స్నానం చేయించక పోతే ఒక ఏనుగ కెంత చికాకో అంత చిరాకుగా ఉందట సంతానం లేక దిలీప మహారాజుకా రాజ్య పాలన. ఎప్పుడు చూచాడో ఈ గజ శాస్త్ర మాయన. వక్రోష్మణా మలిన యంతి పురోగతాని - లేహ్యాని సైంధవ శిలా శకలాని వాహాః. ప్రొద్దున్నే కోష్ఠ శుద్ధి కోసం గుర్రాల ముందు సైంధవ లవణ శకలాల నుంచే వారట సాహిణులు. ఇదెప్పుడు చదివాడో ఈ అశ్వ శాస్త్రం. రోగోప స్పష్ట తను దుర్వసతిం
Page 12